Satyadev: మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్నాడా..? తప్పించారా..?

తన భర్త పాత్రలో సత్యదేవ్ సరిపోరనే అభిప్రాయాన్ని నయనతార వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. 

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో 'గాడ్ ఫాదర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఊటీలో ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తయింది. అయితే చిరంజీవి చేతికి గాయం కావడంతో ఆయన కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ విషయంలో దర్శకనిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. 

Continues below advertisement

Also Read: మోహన్ లాల్ కి జోడీగా మంచువారమ్మాయి..

మలయాళ సినిమా 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సీఎం కొడుకు పాత్ర, కూతురు పాత్ర, ఆమె భర్త పాత్ర చాలా కీలకం. సీఎం కూతురిగా నయనతారను ఆమె భర్తగా సత్యదేవ్ ను ఎంపిక చేసుకున్నారు. కథ ప్రకారం.. సినిమాలో సత్యదేవ్ విలన్. అయితే ఇప్పుడు ఈ క్యాస్టింగ్ విషయంలో గందరగోళం నెలకొందట. తన భర్త పాత్రలో సత్యదేవ్ సరిపోరనే అభిప్రాయాన్ని నయనతార వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. 

ఆయనకు బదులుగా వేరొకరిని చూడమని సలహా ఇచ్చిందట. మరోవైపు.. సత్యదేవ్ ఈ సినిమా నుంచి తనంతట తానే తప్పుకున్నాడని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇతర సినిమాలు, కమిట్మెంట్స్ కారణంగా సత్యదేవ్ 'గాడ్ ఫాదర్' సినిమాకి డేట్స్ కేటాయించలేకపోతున్నాడట. దీంతో సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్. 

మలయాళంలో అయితే ఈ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించారు. నిజానికి తెలుగులో సత్యదేవ్ సూట్ అవుతారు. కానీ ఇప్పుడు ఆయన పాత్రలో కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి ఈ పాత్ర కోసం ఎవరిని రంగంలోకి దించుతారో చూడాలి. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. మెగాస్టార్-సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా ఉంటుందట. ఆ పాత్రను పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తో పాడించాలని అనుకుంటున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..

Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత

Also Read: పునీత్ రాజ్‌ కుమార్‌ కళ్లతో... మరో పది మందికి చూపు!

Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..

Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్

Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని

Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola