పునీత్ రాజ్ కుమార్ రియల్ హీరో. రీల్ లైఫ్‌లో హీరోగా, పవర్ స్టార్ గా మాత్రమే కాదు... రియల్ లైఫ్‌లో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. మరణానికి ముందు ఆయన తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పునీత్ నిర్ణయాన్ని గౌరవిస్తూ... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేశారు. వాటి ద్వారా నలుగురికి చూపు లభించింది. ఇప్పుడు మరో పది మందికి చూపు వచ్చేలా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...



పునీత్ కార్నియా ద్వారా నలుగురికి చూపు లభించింది. ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా ఐదు నుంచి పది మందికి చూపు ఇచ్చే ప్రయత్నాలకు బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. ఈ వివరాలను ఆస్పత్రి చీఫ్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. పునీత్ స్టెమ్ సెల్స్ ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రయోగశాలలో పనులు ప్రారంభం అయ్యానని, దీనికి రెండు వారాల సమయం పడుతుందని, ఆ తర్వాత అర్హులైన వ్యక్తులకు కంటిచూపు ప్రసాదిస్తామని మరో డాక్టర్ యతీశ్ తెలిపారు. ఈ మంచి పనికి డాక్టర్ రాజ్ కుమార్ ఐ బ్యాంక్ సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో ఇటువంటి ప్రయోగం చేయడం మొదటిసారి అని నారాయణ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు.
పునీత్ మరణం తర్వాత ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముందుకు వస్తున్నారు. పునీత్ చదివిస్తున్న పద్దెనిమిది వందల మంది పిల్లలను తాను చదివిస్తానని హీరో విశాల్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు హీరోలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని సమాచారం. సినిమాలకు వస్తే... పునీత్ జయంతి రోజున ఆయన నటించిన 'జేమ్స్' సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 


Aslo Read: సన్నీను ఓ రేంజ్ లో ఆడేసుకున్న నాగ్.. ఫైనల్ గా సారీ చెప్పి..
Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..
Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి