బాలల దినోత్సవం నిర్వహించుకునే ప్రధాన ఉద్దేశం... కేవలం నెహ్రూ జయంతి అని మాత్రమే కాదు, పిల్లల హక్కులు, వారి సంరక్షణ, వారి చదువుకు సంబంధించి పిల్లలతో పాటూ సమాజాన్ని చైతన్య పరచడం. చదువుమానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్చించడం, ఆడపిల్లల హాజరును పెంచడం... ఇవన్నీ బాలల దినోత్సవం ముఖ్యోద్ధాశాలే.
మొదట్లో నవంబర్ 20న...
ఐక్యరాజ్యసమితి ప్రపంచమంతా బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న నిర్వహించుకోవాలని నిర్ణయించింది. మనదేశంలో కూడా అదే రోజున చాలా ఏళ్లు నిర్వహించుకున్నాం. మనదేశ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మరణించాక ఆ తేదీని ఇండియాలో మాత్రం మార్చారు. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ప్రేమ. వారి చేత ‘చాచా నెహ్రూ’ అని పిలిపించుకునేవారు. అంతేకాదు పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందాల్సిందేనని వాదించారు. అందుకే ఆయన పుట్టినరోజైన నవంబర్ 14న ‘చిల్ట్రన్స్ డే’ నిర్వహించాలని పార్లమెంటులో తీర్మానం చేశారు. అదే నెహ్రూకు గౌరవప్రదమైన వీడ్కోలుగా భావించారు. నెహ్రూ 1964 మే 27న మరణించారు. ఆ ఏడాది నుంచే మనం నవంబర్ 14నే బాలల దినోత్సవం నిర్వహించుకోవడం మొదలుపెట్టాం. ఇప్పటికీ ప్రత్యేక దినానికి ఎంతో విలువ ఉంది.
రాజ్యాంగం ప్రకారం పిల్లల హక్కులేంటి?
1. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలందరికీ ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యాహక్కు ఉంది.
2. ఆర్టికల్ 24 ప్రకారం పద్నాలుగేళ్ల వయస్సు వరకు ప్రమాదకరమైన పనులు, ఉపాధి పిల్లలు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తున్న పిల్లలను రక్షించాలి.
3. ఆర్టికల్ 39 (ఇ) ప్రకారం వారి వయసు, శక్తికి మించిన పనులు వారిచేత చేయించకూడదు. ఆర్థిక అవసరాల కోసం వారిని దుర్వినియోగం చేయకుండా కాపాడడం.
4. ఆర్టికల్ 39(ఎఫ్) ప్రకారం స్వేచ్ఛ, గౌరవం, అన్నింట్లో సమాన అవకాశాలు, సౌకర్యాలు పొందే హక్కు పిల్లలకి ఉంది. వారి బాల్యం దోపిడీకి గురికాకుండా కాపాడుతుంది ఈ చట్టం.
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: ఫుడ్ ప్యాకింగ్ లేబుళ్లపై ఇలా రాసి ఉంటే కొనే ముందు ఆలోచించండి, ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి