తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.20 పెరగ్గా.. వెండి ధర గ్రాముకు రూ.0.30 పైసలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.300 ఎగబాకినట్లయింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో గ్రాముకు రూ.20 పెరిగి.. రూ.46,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,100 కు ఎగబాకింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,700గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,700 గా ఉంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,280గా ఉంది.


ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.36 తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,580 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి