ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, హైదరాబాదీలు 'బాహుబలి'గా పిలుచుకొనే డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అతడు మరో 30 పరుగులు చేస్తే మాథ్యూ హెడేన్‌ రికార్డును బద్దలు కొడతాడు. ఒక పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ ఆటగాడిగా నిలుస్తాడు.


2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌లో మాథ్యూ హెడేన్‌ 265 పరుగులు చేశాడు. ఆ తర్వాత షేన్‌ వాట్సన్‌ 2012లో 249 పరుగులతో అతడి వెనకాలే నిలిచాడు. అప్పటి నుంచి టీ20ల్లో మరే ఆసీస్‌ ఆటగాడూ వీరి రికార్డులకు చేరువ కాలేదు. ఇన్నాళ్లకు డేవిడ్‌ వార్నర్‌ ముంగిట ఆ అవకాశం నిలిచింది.


గాయం తర్వాత జట్టులోకి వచ్చిన వార్నర్‌ ఏమంత ఫామ్‌లో లేడు. ఐపీఎల్‌ 2021లోనూ అంతగా రాణించలేదు. పైగా కెప్టెన్సీ కోల్పోయాడు. కొన్ని మ్యాచుల్లో తుది జట్టులోకీ ఎంపిక కాలేదు. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం అతడు ఫామ్‌లోకి వచ్చాడు. ఆరు మ్యాచుల్లోనే 47 సగటు 159 స్ట్రైక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలూ బాదేశాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న ఆరోన్‌ ఫించ్‌ చేసింది 130 పరుగులే కావడం గమనార్హం.


ఒకప్పటిలా డేవిడ్‌ వార్నర్‌ చితక్కొట్టడం లేదు. కేవలం బాదుడు మంత్రం పఠించడం లేదు. మ్యాచులను అంచనా వేస్తున్నాడు. పిచ్‌లను అర్థం చేసుకుంటున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదడం తక్కువ చేశాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తున్నాడు. తన ఆటతీరును మార్చుకున్నాడు. ధనాధన్‌ పరుగులు చేయకుండా జట్టుకు విజయాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అవసరమైనప్పుడు ఆచితూచి ఆడుతూ.. సందర్భం దొరగ్గానే దంచికొడుతున్నాడు.


పాకిస్థాన్‌తో మ్యాచులో వార్నర్‌ బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే! ఆరంభంలో ఆచితూచి ఆడాడు. షాహిన్‌ బౌలింగ్‌ను తెలివిగా ఎదుర్కొన్నాడు. ఇతరులు రాగానే వరుస బౌండరీలు బాదేశాడు. 30 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మూడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదేశాడు. పవర్‌ప్లేలో తెలివిగా పరుగులు రాబట్టాడు. ఫైనల్లోనూ ఆసీస్‌ గెలవాలంటే అతడి బ్యాటింగ్‌ ఎంతో కీలకం.


Also Read: SBI Credit Card ALERT : ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు షాక్‌! ఇకపై ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తున్న సంస్థ


Also Read: MobiKwik RuPay Card: మొబిక్విక్‌ రూపే కార్డు.. ముందే రూ.30వేలు వాడేసుకోవచ్చు..! మరెన్నో ఆఫర్లు..!


Also Read: PM Modi Launches RBI Schemes: రెండు కొత్త పథకాలు ఆరంభించిన ప్రధాని మోదీ.. ఆర్‌బీఐ పరిధిలోని ఈ 2 స్కీములతో ప్రజలకు లాభాలివే!


Also Read: Multibagger stock: ఈ ఐటీ స్టాక్‌ 18 నెలల్లో లక్షకు రూ.16.65 లక్షల రాబడి ఇచ్చింది.. ఏం కంపెనీయో తెలుసా?


Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి