యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. చైతన్యకు తొలి స్ట్రయిట్ తమిళ చిత్రమిది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
ఇది చైతూ మాస్
నాగ చైతన్య ఇంతకు ముందు కొన్ని మాస్ సినిమాలు చేశారు. అయితే, 'కస్టడీ'లో మాత్రం ఆయన యాక్షన్ కొత్తగా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ వీడియో నిడివి పెద్దగా లేదు. జస్ట్ 26 సెకన్లు. అందులో విజువల్స్ నిడివి ఇంకా తక్కువ. అయితేనేం? సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోందనేది వెంకట్ ప్రభు చూపించారు.
పల్లెటూరి మధ్యలో వెళుతున్న బొగ్గు రైలును ముందు చూపించారు. ఆ తర్వాత రోడ్డు మీద వెళుతున్న కార్లు (పోలీస్ కార్స్), ఆ తర్వాత జాతర సెటప్, ఆ వెంటనే బ్లాస్ట్... స్మోక్ ఎఫెక్ట్ మధ్యలో నుంచి నాగ చైతన్య ఎంట్రీ, రెండు మూడు యాక్షన్ కట్స్! మొత్తం మీద గ్లింప్స్ బావుంది.
'కస్టడీ'లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సినిమాలో ఆయన పేరు 'ఏ చైతన్య'. 'ఏ' అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్.
మే 12న విడుదల
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. మే 22న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు.
ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ఈ వీడియో బాగా నచ్చింది. 'తడాఖా' సినిమాలో నాగ చైతన్య కొన్ని సన్నివేశాల్లో పోలీసుగా కనిపిస్తారు. కానీ, పోలీస్ కాదు. అసలు పోలీస్ సునీల్.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ - NTR 30 విడుదల ఎప్పుడో చెప్పేశారోచ్!
అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : వెంకట్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్, యాక్షన్ : మహేష్ మాథ్యూ, కళా దర్శకత్వం : డివై సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు.
Also Read : 'కెజియఫ్'లో రాకీ భాయ్‌లా ఉన్నాడేంటి? రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' ఫస్ట్ లుక్‌పై కామెంట్స్