యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం ఆరోగ్యానికి ఎన్నో రకాలు మేలు చేస్తుంది. చలికాలంలో ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన ఔషధం ఇది. నీలగిరి కొండల్లో అధికంగా ఈ చెట్లు అధికంగా పెరుగుతాయి కాబట్టి ఈ చెట్లను నీలగిరి చెట్లు అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులను చేత్తో నలిపి వాసన చూడండి, ఆ వాసనకు ఏదో తెలియని ఉపశమనం కలుగుతుంది. అందుకే ఈ ఆకులతో చేసిన తైలాన్నే జండూబామ్, జిందా తిలిస్మాత్, అమృతాంజన్, విక్స్ వంటి ఇంగ్లిషు మందుల్లో నీలగిరి ఆకులను వాడతారు. ఆయుర్వేదం నీలగిరి తైలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తైలంలో ఎన్నో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఉన్నాయి. అందులో జలుబుకు దీన్ని మందుగా వాడతారు. అధ్యయనాలు కూడా యూకలిప్టస్ నూనె బ్యాక్టిరియా, వైరస్‌లను చంపుతుందని తేలింది.
చలికాలంలో యూకలిప్టస్ నూనెను రోజూ వాసన చూడడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. గాయాలు, కోతలు, కాలిన గాయాలు ఉన్నప్పుడు ఈ నూనెను కాస్త పూతలా పూయాలి. అంతేకాదు బొబ్బలు, పుండ్లు, గజ్జి వంటి సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది. కండరాలు నొప్పి పుడుతున్నప్పుడు ఈ నూనెను మర్ధనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వాపును కూడా తగ్గిస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ నూనెను ఓ మూడు చుక్కలు నుదులిపై రాసుకుని, మసాజ్ చేసుకుంటే మంచిది. కొన్ని నిమిషాలకే తలనొప్పి తగ్గుతుంది.
దగ్గు వేధిస్తున్నప్పుడు నీలగిరి తైలం బాగా ఉపయోగపడుతుంది. రెండు చుక్కలు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇది దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది. జలుబు వల్ల ముక్కు పట్టేసినట్టు అయితే వెంటనే ఈ నూనెను వాసన పీల్చండి. మంచి ఫలితం ఉంటుంది. అలాగే శ్వాస కోశ సమస్యలకు ఇవి బాగా పనిచేస్తుంది. ఒళ్లు నొప్పులుగా అనిపిస్తే గోరువెచ్చటి వేడి నీటిలో ఎనిమిది చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి స్నానం చేయాలి. గోరువెచ్చని నీటిలో మూడు నుంచి నాలుగు చుక్కల ఈ తైలాన్ని కలిపి తాగితే అజీర్ణం, అజీర్తి తగ్గుతాయి. విరేచనాలు కూడా ఆగుతాయి. రోజుకు రెండు చుక్కల నీలగిరి తైలాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
Also read: చలి కాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే, చలికాలపు వ్యాధులు కూడా రావు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.