చిక్కని చలి మరో నెలరోజులైనా ఉంటుంది.  ఈ నెలరోజుల్లో ఎలాంటి చలి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి వెచ్చదనాన్ని కలిగించే ఆహారాన్ని తినాలి. శీతాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని రోగనిరిధోక వ్యవస్థకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్లూ, COVID-19, శ్వాసకోశ వ్యాధులతో సహా ఇతర వ్యాధులు త్వరగా సోకుతాయి.ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.కొన్ని నిర్దిష్ట ఆహారాలు శరీరానికి వేడిని అందిస్తూ, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.


ఉల్లిపాయ: ఉల్లిపాయలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది చలిని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ సూప్ తాగితే చాలా మంచిది. మీ వంటకాలకు ఉల్లిపాయలను జోడించడం లేదా వాటిని పచ్చిగా తినడం వల్ల శరీరానికి అదనపు శక్తిని ఇచ్చినట్టే.


దేశీ నెయ్యి: చాలా మందికి నెయ్యి లేకుంటే భోజనం పూర్తవ్వదు. పప్పులో ఒక స్పూను నెయ్యి వేసుకుని తింటేనే వారికి రుచిస్తుంది. శీతాకాలంలో రోజూ నెయ్యి తినడం అనేది చాలా మంచి అలవాటు. నెయ్యి మీలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, వెచ్చగా ఉంచుతుంది. 


ఆవ నూనె: ఆరోగ్యకరమైన వంట నూనెలలో ఒకటి ఆవ నూనె. దీన్ని తినడం శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. అందుకే శీతాకాలంలో వంటచేయడానికి ఇది ఉత్తమ ఎంపిక. చల్లని వాతావరణంలో ఆవనూనెతో వంట చేయడం అలవాటు చేసుకోండి. 


బెల్లం: బెల్లం కూడా శీతాకాలంలో ఎంతో ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. రక్త నాళాలను విస్తరించేలా చేస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తగినంత శక్తిని అందిస్తుంది. 


అల్లం: జలుబు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అల్లంలో అధికం. దీనిలో శరీర వేడిని పెంచే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అల్లం టీ చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. ఆహారంలో కూడా భాగం చేసుకోవాలి. 


చిరుధాన్యాలు: రాగులు, సజ్జలు, జొన్నలు వంటి వాటితో వంటలు చేసుకుని తినాలి. ఇవి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. చలిని తట్టుకునే శక్తిని ఇస్తాయి.


Also read: కొత్త ఏడాదిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ పనులు చేస్తామని ప్రమాణం చేయండి



























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.