హైదరాబాద్ వాసులకు కొత్త సంవత్సర కానుక.. అందుబాటులోకి కొత్తగూడ ఫ్లై ఓవర్
కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్ వాసులకు మరో కొత్త ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. రూ.263 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభంతో కొండాపూర్, గచ్చిబౌలి వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మూడు కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ఫ్లై ఓవర్‌కు అనుబంధంగా 470 మీటర్ల పొడవుతో 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్‌ను కూడా చేపట్టి అధికారులు పూర్తి చేశారు. ఇందులో 65 మీటర్ల పొడవుతో క్లోజ్డ్ బాక్స్ 425 మీటర్ల ఓపెన్ బాక్స్ గల అండర్ పాస్ చేపట్టారు.
కాగా కొత్తగూడ ఫ్లై ఓవర్ వల్ల గచ్చిబౌలి, కొండాపూర్ వాసులు ప్రయోజనం పొందుతారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు పరిసర ప్రాంతాలను కలుపుతుంది. ఈ వంతెన వల్ల బొటానికల్ గార్డెన్, కొత్తగూడ జంక్షన్‌లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిషారం అవడమే కాకుండా కొండాపూర్ జంక్షన్‌లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది..
నుమాయిష్‌కు సర్వం సిద్ధం.. నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ ఆత్మను ఆవిష్కరించే నుమాయిష్ నుమాయిష్‌కు సర్వం సిద్ధమైంది. 8దశాబ్దాలుగా ఈ ప్రదర్శ నకు ఆతిథ్యం ఇస్తున్న నాంపల్లి ఎగ్జి బిషన్ గ్రౌండ్ 81వ నుమాయిష్‌కు ముస్తాబైంది. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 15వరకు 45రోజులపాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సాగనున్న ఈ ప్రదర్శనలో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వ్యాపారులకు చెందిన 2,400కు పైగా స్టాళ్లు కొలువుదీరాయి.
నేడు యాదాద్రీశుడి ప్రత్యేక దర్శనాలు
నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభూ నరసింహుడి దర్శనానికి నేడు ఉదయం 6.30 నుంచే అనుమతిస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. నేడు నూతన సంవత్సరం దృష్ట్యా ఆలయ శుద్ధి చేపట్టి కొబ్బరి మట్టలు, అరటి ఆకులు, పూలతో ద్వారాలను ముస్తాబు చేశారు. స్వామివారి ప్రసాదాన్ని కావాల్సినంత అందుబాటులో ఉంచనున్నట్టు ఆమె పేర్కొన్నారు. వంద గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలను లక్ష వరకు అందుబాటు లో ఉంచినట్టు చెప్పారు. పులిహోర ఎక్కువ మొత్తంలో తయారు చేసి సిద్ధంగా ఉంచినట్టు ఆమె తెలిపారు. స్వామివారి ప్రసాద విక్రయ కౌంటర్లను ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంచుతామని అన్నారు. కొండపైన ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
నేటి పూజలు ఇలా..
2 ఉ.3 నుంచి 3:30 వరకు సుప్రభాతం
2 ఉ.3:30 నుంచి 4 వరకు తిరువారాధన
2 ఉ.4 నుంచి 5 వరకు బాలభోగం,
2 ఉ. 5 నుంచి 6 వరకు నిజాభిషేకం
2 ఉ. 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనాలు
2ఉ.10నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉభయ దర్శనాలు
2 మ.12 నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న రాజభోగం
2 మ.ఒంటి గంట నుంచి సాయంత్రం 4 వరకు ఉభయ దర్శనాలు
2 సా. 4 నుంచి 5 వరకు బ్రేక్ దర్శనాలు
2 సా.5 నుంచి రాత్రి 7 వరకు
ఉభయ దర్శనాలు
2 రాత్రి 7:30 నుంచి 8:15 వరకు
సహస్రనామార్చనలు
2 రాత్రి 9నుంచి 9:45వరకు రాత్రి నివేదన