'యానిమల్' ఫస్ట్ లుక్ (Animal First Look) వచ్చేసింది. తెలుగులో యంగ్ అండ్ న్యూ ఏజ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే... 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కపూర్ వారసుడు, బాలీవుడ్ యంగ్‌స్టర్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అందుకని, సౌత్ ఆడియన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
'యానిమల్'లో రణ్‌బీర్‌ను చూశారా?
'యానిమల్' ఫస్ట్ లుక్‌ను న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న మిడ్ నైట్ విడుదల చేశారు. చేతిలో గొడ్డలి... నోటిలో సిగరెట్... భుజానికి, ఒంటిపై కొన్ని చోట్ల రక్తం... శత్రువులతో పోరాడిన తర్వాత తీరిగ్గా రణ్‌బీర్ దమ్ము కొడుతున్నట్టు ఉంది. బీస్ట్ లాంటి రోల్ చేశాడని అర్థం అవుతోంది.
ఆగస్టులో 'యానిమల్' విడుదల!
Animal Movie Release Date, August 11th, 2023 : ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023లో విడుదల చేయనున్నారు.
హిందీలో రష్మికకు మూడో చిత్రమిది. గత ఏడాది, 2022లో 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను' చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా ఇది మూడో సినిమా. 'అర్జున్ రెడ్డి'తో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ఆ సినిమాను హిందీలో షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. ఇది మూడో సినిమా.
రాకీ భాయ్‌లా ఉన్నాడేంటి?
'యానిమల్' ఫస్ట్ లుక్ ఇలా విడుదలైందో? లేదో? ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ లుక్ కొత్తగా ఏమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు. రాకీ భాయ్ పాత్రలో కన్నడ కథానాయకుడు యశ్ నటించిన 'కెజియఫ్' గుర్తు ఉందిగా! 'యానిమల్' ఫస్ట్ లుక్ చూస్తే... రాకీ భాయ్ గుర్తుకు వస్తున్నాడని చెబుతున్నారు. నిజం చెప్పాలంటే... రెండూ డిఫరెంట్ లుక్స్! 'కెజియఫ్'లో యశ్ సిగరెట్ తాగే సీన్లు హైలైట్ అయ్యాయి. 'కెజియఫ్ 2' విడుదల చేసిన టీజర్ చూస్తే... గన్ ఫైరింగ్ చేసిన తర్వాత నిప్పు కణికలా మారిన గన్ సాయంతో సిగరెట్ అంటిస్తారు. అందువల్ల, అలా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : 'ఖుషి' కలెక్షన్స్ - రీ రిలీజుల్లో పవన్ కళ్యాణే టాప్
ఒక్క లుక్ చూసి సినిమా మీద కామెంట్స్ చేయడం సరికాదు. కథలు వేర్వేరు, ఆ సన్నివేశాలు వేర్వేరు. ఈ విమర్శలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
'బ్రహ్మాస్త్ర' కంటే భారీ హిట్ కావాలి!
రణ్‌బీర్ కపూర్‌కు గత ఏడాది 'బ్రహ్మాస్త్ర' భారీ విజయాన్ని అందించింది. హిందీలో మాత్రమే కాకుండా, దేశ వ్యాప్తంగా బాగా ఆడింది. 'యానిమల్' కూడా ఆ స్థాయిలో విజయం సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!? - నరేష్, పవిత్ర పెళ్లిపై రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా?