యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) అభిమానులకు హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఏడాది తొలి రోజున నిజంగా వాళ్ళకు హ్యాపీనెస్ ఇచ్చే కబురును NTR 30 చిత్ర బృందం చెప్పింది. సినిమాను ఎప్పుడు విడుదల చేసేదీ ఈ రోజు అనౌన్స్ చేసింది. 


2024లో ఎన్టీఆర్30
NTR 30 Release Date : ఎన్టీఆర్ కొత్త సినిమా కొత్త ఏడాదిలో లేనట్టే! ఈ 2023లో సినిమా విడుదల చేయడం లేదని ఈ రోజు స్పష్టంగా చెప్పేశారు. ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రానున్నట్లు తెలిపారు. తేదీన సినిమా విడుదల కానుంది.


ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. 


అమెరికా నుంచి వచ్చాక పూజ
ప్రస్తుతం ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నారు. భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్ రామ్.... ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందు ఆయన ఇండియా రానున్నారని తెలిసింది. వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించనున్నారు.


ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు
ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ 30 సెట్స్ మీదకు వెళ్ళనుంది. దర్శకుడు కొరటాల శివ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫినిష్ చేసారని తెలిసింది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత బ్రేకులు లేకుండా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'బృందావనం' చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ చేశారు.


నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు. 


Also Read : రాకీ భాయ్‌లా ఉన్నాడేంటి? రణ్‌బీర్‌ కపూర్‌ 'యానిమల్‌' ఫస్ట్‌ లుక్‌పై కామెంట్స్‌






'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత పాన్ ఇండియా మాత్రమే కాదు... జపాన్, వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు పెరిగారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు పరిచయమైన నటీనటులు ఎక్కువ మంది సినిమాలో ఉండనున్నారు. 


ఎన్టీఆర్ 30లో కథానాయికగా తొలుత ఆలియా భట్ పేరు వినిపించింది. అయితే, ఆమె తల్లి కావడంతో పాటు షూటింగ్ లేట్ కావడం వల్ల ఇప్పుడు ఆమెను తీసుకునే ఛాన్స్ లేదు. లేటెస్టుగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు. 



Also Read : పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!? - నరేష్, పవిత్ర పెళ్లిపై రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా?