అక్కినేని నాగార్జున(Nagarjuna) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'(The Ghost). సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి ప్రవీణ్ సత్తారు(Praveen Sattharu) దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది చిత్రయూనిట్. 


ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి.. సినిమాపై బజ్ పెరిగేలా చేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. కర్నూలులోని STBC కాలేజ్ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరగనుంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ ఈవెంట్ కి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ రాబోతున్నారు. నాగార్జున, చైతు, అఖిల్ ఒకే స్టేజ్ పై కనిపిస్తున్నారంటే అక్కినేని ఫ్యాన్స్ కి పండగే. కచ్చితంగా ఈ ఈవెంట్ కి జనాలు తరలివచ్చే ఛాన్స్ ఉంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 






చిరుతో పోటీపై నాగార్జున రియాక్షన్:


మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవ్వడం చర్చకు దారి తీసింది. అయితే నాగార్జున వెనక్కి తగ్గుతారని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది 'ది ఘోస్ట్' టీమ్. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. రీసెంట్ గా సినిమాలో ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. 


గత రెండు దశాబ్దాల్లో చిరంజీవి, నాగార్జున ఇలా తలపడింది లేదు. అయితే ఈ క్లాష్ ని ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇంకా మీడియా ముందుకు రాలేదు కానీ.. ఆయన కంటే ముందు తన సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాను కలిసిన నాగార్జున.. చిరుతో క్లాష్ గురించి మాట్లాడారు. చిరంజీవిని చాలా మంది ఇష్టపడతారని.. ఇద్దరి సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దసరా సమయంలో ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదల కావడం గత నలభై ఏళ్లుగా జరుగుతుందని.. సినిమా బాగుంటే పోటీకి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ సినిమాల సక్సెస్ ఈ ఇద్దరి హీరోలకు చాలా ముఖ్యం. మరి ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి!   


Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?


Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?