మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా 'మాస్టర్ చెఫ్' అనే షో మొదలైన సంగతి తెలిసిందే. అయితే షో మొదలైన కొన్నిరోజులకే తమన్నా స్థానంలో యాంకర్ అనసూయను తీసుకున్నారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రొడక్షన్ హౌస్ కి తమన్నా లీగల్ నోటీసులు పంపించింది. తనతో అన్ ప్రొఫెషనల్ గా ప్రవర్తించారని.. పేమెంట్ కూడా ఎగ్గొట్టారని తమన్నా ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ విషయంపై స్పందించిన 'మాస్టర్ చెఫ్' షో నిర్వాహకులు తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమన్నా వలన దాదాపు రూ.5 కోట్లు నష్టపోయామని చెప్పారు.
Also Read: ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే...!
తమన్నాను హోస్ట్‌గా తీసుకున్నప్పుడురూ.2కోట్లు రెమ్యునరేషన్‌కు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు మధ్యలో 18 రోజులపాటు షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె సైన్ చేశారని.. కానీ ఆమెకున్న కమిట్‌మెంట్స్ వల్ల 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. మిగిలిన రెండు రోజులు ఆమె షూటింగ్‌కు రాలేదని.. అప్పటికే రూ. 1.56 కోట్ల పేమెంట్ ఇచ్చినట్లు చెప్పారు.
ఆమె రెండు రోజుల పాటు షూటింగ్ కు రాకపోవడంతో దాదాపు 300 మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ కి రూ. 5 కోట్లకు పైగానే నష్టం వచ్చిందని తెలిపారు. అగ్రిమెంట్ చేసుకున్నదాని ప్రకారం ఆమె మొత్తం షూటింగ్ పూర్తి చేసి ఉంటే బ్యాలెన్స్ ఉన్న రూ. 50 లక్షల పేమెంట్ కూడా ఇచ్చేసేవాళ్లమని.. కానీ అది పూర్తి చేయకుండానే..సెకండ్ సీజన్‌కు అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు సెకండ్ సీజన్‌కు హోస్ట్‌గా ఆమెను అనుకోలేదని షాకిచ్చారు.
అప్పటివరకు తమన్నా హోస్ట్ చేసిన ఈ షోలో అనసూయ కనిపించడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. తన స్థానంలోకి అనసూయను తీసుకోవడంతో పాటు తనకు ఇస్తానని చెప్పిన రెమ్యునరేషన్ కూడా షో నిర్వాహకులు ఇవ్వలేదని తమన్నా చట్టపరచర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 27న మొదలైన ఈ షో తొలి మూడు ఎపిసోడ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత టీఆర్ఫీ బాగా తగ్గిపోయింది.
Also Read: 'మీ అమ్మాయి పెళ్లికోసం డబ్బు దాచకండి' సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి