జక్కన్న చెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఓవియా నటిస్తోన్న ఈ మూవీ బాహుబలికి మించి అని ఫిక్సైపోయారు అభిమానులు. ఇప్పటికే తగ్గేదే అన్నట్టు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ గ్లింప్స్ దోస్తీ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపింది. కొమురం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీల లుక్ వైరల్ అయింది. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు రెడీ అవుతోన్నజక్కన్న...ఈ నెల 29న ''ఆర్ఆర్ఆర్'' టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పనిలో పనిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారట.
కరోనా కేసులు తక్కువగా ఉన్నందున దుబాయ్ లోనే ఐపీఎల్ టీ20 వరల్డ్ కప్ నిర్వహించారు. అందుకే భారీగా నిర్వహించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమౌళి అక్కడే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ''బాహుబలి'' తర్వాత వస్తోన్న మూవీ కావడంతో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో జనవరి 7న విడుదలకానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ ను దుబాయిలో ప్లాన్ చేయడం వల్ల సినిమా పాన్ ఇండియా స్థాయిని మించి ఇమేజ్ వస్తుందన్నది జక్కన ప్లాన్ అంటున్నారు. పైగా ఈ ఈవెంట్ ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, దుబాయ్ లోనేనా అన్నది అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.