విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొత్తగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది. లైఫ్ పై క్లారిటీ మరింత పెరిగినట్టు అనిపిస్తోంది. ఓ వైపు స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శంచిన సామ్ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తాజాగా యాత్ర ముగించుకుని వచ్చాక పెయింటింగ్స్ వేస్తున్న ఫొటోస్ షేర్ చేయడమే కాదు  ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చెబుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Continues below advertisement


” మీ కుమార్తెను ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడనవసరం లేకుండా ఆమెను సమర్థవంతంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి రోజు కోసం డబ్బు ఆదా చేసే బదులు, ఆమె చదువుకి ఖర్చు పెట్టండి. మరీ ముఖ్యంగా ఆమెను పెళ్లికి సిద్ధం చేసే బదులు, ఆమె కోసం ఆమెను సిద్ధం చేయండి. ఆమెకు ఆత్మవిశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి.   ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి”.. అంటూ పోస్ట్ చేసింది సామ్.






ఇక వరుస సినిమాతో బిజీగా ఉంది సమంత. శాకుంత‌లం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసింది సమంత. ఏదేమైనా ఓ వైపు ఆధ్యాత్మిక పర్యటన, మరోవైపు ఇంట్రెస్టింగ్ పోస్టులు, ఇంకోవైపు  వరుస ప్రాజెక్టులతో సమంత ఫుల్ బిజీగా ఉంది. 
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
Also Read: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం హౌస్ మేట్స్ పాట్లు.. పేడలో దిగి మరీ..
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి