బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే ఏడు వారాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ లో సన్నీ తన తల్లి లెటర్ చూడగానే ఏడుపొచ్చిందంటూ ఒక్కడే కూర్చొని ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత షణ్ముఖ్.. సిరితో మాట్లాడుతూ.. విశ్వ చాలా సెల్ఫిష్ అని, లెటర్ టాస్క్ విషయంలో ఆయన బిహేవియర్ అసలు నచ్చలేదని అన్నాడు. 'నా సిరి' అని లెటర్ పై చూసిన తరువాత వదులుకున్నా.. కొడుకు పేరు చెప్పడం వదిలేశానని సిరి చెప్పుకొచ్చింది. నామినేషన్స్ అంటే విశ్వకి భయమని చెప్పింది. 


Also Read: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'..


ఈ వారం ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారా అని మానస్-ప్రియాంక-సిరి మాట్లాడుకుంటున్న సమయంలో 'నేను మానస్ టాప్ 5 లో ఉంటామని' ప్రియాంక.. సిరితో చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఆ తరువాత మానస్ 'అంకుల్స్ అందరూ బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లందరూ లోపల ఉండాలి' అని అన్నాడు. వెంటనే సిరి 'ఆంటీలంటే పింకీ వెళ్లిపోవాలి మరి' అని నవ్వుతూ కౌంటర్ వేయగా.. 'మొహం పగిలిపోద్ది' అంటూ నవ్వేసింది ప్రియాంక.


ఆ తరువాత రవి-షణ్ముఖ్ డిస్కషన్ పెట్టారు. ముందుగా రవి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ చెప్పాడు. 


ఇక సన్నీ-కాజల్ కూర్చొని లెటర్స్ క్రష్ చేయడంపై చర్చించుకున్నారు. షణ్ముఖ్ కి వాళ్ల మమ్మీ, మానస్ కి వాళ్ల నాన్నగారు లెటర్స్ రాశారని.. అందరూ ఫస్ట్ టైం లెటర్ రాసి ఉంటారని.. అలాంటి లెటర్స్ ని క్రష్ చేస్తుంటే ఎంతో బాధ అనిపించిందని ఎమోషనల్ అయింది కాజల్. 


కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్..


హౌస్ మేట్స్ కి 'అభయహస్తం' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఇల్లు మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందన్న బిగ్ బాస్... చాలెంజ్ గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశంతో పాటూ ఇంట్లోకి ప్రవేశిస్తారని చెప్పారు. ఐదు ఛాలెంజ్ లను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ లలో ఎవరెవరైతే పోటీ పడతారో.. హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని ఆడాలని చెప్పారు. ఒక ఛాలెంజ్ లో ఓడిపోయిన సభ్యులు.. హౌస్ మేట్స్ ని ఒప్పించి మరొక ఛాలెంజ్ లో పాల్గొనొచ్చని బిగ్ బాస్ చెప్పారు. 


మట్టిలో ముత్యాలు.. 


ఈ టాస్క్ ప్రకారం.. పేడతో నిండివున్న బాత్ టబ్ లో దిగి ముత్యాలను ఏరాల్సి ఉంటుంది. అలా ఏరిన ముత్యాలను నీళ్లలో కడిగి వేరే బౌల్ లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఛాలెంజ్ లో లోబో-షణ్ముఖ్ పాల్గొనగా.. షణ్ముఖ్ ఎక్కువ ముత్యాలను బయటకు తీశాడు. అయితే అతడి ముత్యాల్లో పేడ ఎక్కువ ఉందని విశ్వ, శ్రీరామ్.. సన్నీకి చెప్పగా.. 'వందమంది వందవాగుతారు పట్టించుకోవద్దని.. సంచాలక్ గా నీ నిర్ణయం తీస్కో..' అని షణ్ముక్.. సన్నీకి చెప్పాడు. దానికి విశ్వ రియాక్టయ్యాడు. ఆ వందమందిలో నువ్వున్నావా అనేసరికి ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. మరోవైపు కాజల్ పై లోబో ఫైరయ్యాడు. నువ్వు అక్కడికి పోయి మాట్లాడుకో అని చెప్పడంతో నీకు వినే ఉద్దేశం లేకపోతే చెవులు మూసుకో అంది కాజల్. ఎక్కిడకో వెళ్లి మాట్లాడాల్సిన అవసరం తనకేంటన్న కాజల్ ఇక్కడే ఉంటానని బరాబర్ మాట్లాడతా అని తేల్చేసింది. ఫైనల్ గా ఈ టాస్క్ లో షణ్ముఖ్ విజేతగా నిలిచినట్లు చెప్పాడు సన్నీ. దీంతో షణ్ముఖ్ మొదటి కెప్టెన్సీ కంటెండర్ గా ఎన్నికయ్యాడు. 


గాలం మార్చే మీ కాలం..


పూల్ అడుగున ఉన్న బాటిల్స్ ను ఫిషింగ్ రాడ్ తో బయటకు తీయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీస్తారో వారే విజేతలు. ఈ టాస్క్ లో సిరి-రవి పార్టిసిపేట్ చేయగా.. సిరి ఎక్కువ బాటిల్స్ బయటకు తీయడంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్ గా ఎన్నికైంది. 


తాడుల తకదిమి..


 గార్డెన్ ఏరియాలో ఉన్న రోప్స్ ని ఎక్కువసేపు కదపాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా ఆగిపోతారో వాళ్లు ఓడిపోతారు. శ్రీరామ్-మానస్ ఇందులో పాల్గొనగా.. శ్రీరామ్ విజయం సాధించి మూడో కెప్టెన్సీ కంటెండర్ గా ఎన్నికయ్యాడు. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి