ఇండియన్ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమా బిజినెస్ అంతకుమించి జరుగుతుందని భావించారు. అయితే ఇప్పుడు దీని మార్కెట్ విలువను ముప్పై శాతానికి తగ్గించినట్లు సమాచారం. ఏపీలో టికెట్ రేట్లు, కరోనా తరువాత అక్కడ చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది థియేటర్లకు రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఇప్పుడు సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ కూడా తగ్గిందని అంటున్నారు. 


Also Read: రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..


ఆంధ్రప్రదేశ్, సీడెడ్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఒక్క ఈస్ట్ ఏరియాలోని రూ.18 కోట్ల రేషియోలో డీల్ సెట్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని రూ.13 కోట్లకు తగ్గించేశారు. ఉత్తరాంధ్ర ఏరియాకు సంబంధించి సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ.26 కోట్లకు తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. దీంతో ఆ మొత్తాన్ని కుదించి రూ.19 కోట్లకు ఫైనల్ చేశారు. 


ఆంధ్ర-సీడెడ్ కలిపి వంద కోట్ల రేంజ్ లో అమ్ముడవుతుందని భావిస్తే ఇప్పుడు మొత్తం కలిపి రూ.68 కోట్లకు ఇచ్చేయాల్సిన పరిస్థితి కలుగుతోంది. నైజాం బిజినెస్ లో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. ఓవర్సీస్ కూడా ముందు అనుకున్నట్లుగా కాకుండా తగ్గించమని అడుగుతున్నారట బయ్యర్లు. ప్రస్తుతం దానిపై చర్చలు జరుగుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ లో మాత్రమే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాన్-థియేట్రికల్ డీల్స్ కు సంబంధించి ఎలాంటి మార్పులు లేవట. 


ఏపీలో అయితే 'ఆర్ఆర్ఆర్'తో పాటు మిగిలిన సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ టికెట్ రేట్ ఇష్యూ ఓ కొలిక్కి వస్తే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా రన్ టైం 2 గంటల 45 నిముషాలు ఉండబోతుంది. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు. 


Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!


Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!


Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి


Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!


Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!


Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి