మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు.. తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పరాజయ భారంతో ప్రకాష్ రాజ్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగోడిని కాకపోవడం వల్లే ‘మా’ సభ్యులు తిరస్కరించారని, తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ప్రాంతీయవాదాన్నే అజెండాగా చేసుకున్న అసోసియేషన్‌లో ఇకపై సభ్యుడిగా ఉండబోనని, టాలీవుడ్ పెద్దలు చెప్పినట్లు.. ‘‘అతిథిని.. అతిథిగానే ఉంటాను’’ అని ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో వాపోయారు.
ప్రకాష్ తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ విష్ణుకు వాట్సాప్ చేశారు. ‘‘డియర్ విష్ణు.. అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు. ‘మా’ను సమర్దవంతంగా నడిపించేందుకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఉంటాయి. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించగలరు. సభ్యత్వం లేకున్నా.. నీకు ఎప్పుడు అవసరమైనా మీకు సహకరిస్తాను. థాంక్యూ’’ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
దీనికి మంచు విష్ణు సమాధానమిస్తూ.. ‘‘డియర్ అంకుల్.. థాంక్యూ. మీ నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నా కంటే పెద్దవాళ్లు. జయపజయాలు అనేవి ఒకే నాణానికి అటూ ఇటూ ఉంటాయి. ఆ రెండిని మనం ఒకేలా భావించాలి. దయచేసి మీరు భావోద్వేగానికి గురికావద్దు. మీరు కూడా మా కుటుంబంలో ఒకరు. నాకు మీ సలహాలు కావాలి. కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ మెసేజ్‌కు రిప్లై ఇవ్వకండి. నేను మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. మీతో మాట్లాడతాను. ఐ లవ్ యూ అంకుల్, దయచేసి తొందరపడొద్దు’’ అని తెలిపారు. ఈ వాట్సాప్ చాటింగ్‌ను విష్ణు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి