సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'హీరో'. తొలుత ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడటంతో ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. అందుకని, సినిమాను 11 రోజులు ముందుకు తీసుకొచ్చారు. జనవరి 15న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
"ఈ సంక్రాంతికి థియేటర్లలో దీపావళి టపాసుల్లాంటి వినోదానికి సిద్ధం అవ్వండి. జనవరి 15న గ్రాండ్‌గా 'హీరో' విడుదల అవుతుంది" అని అశోక్ గల్లా ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా 'హీరో' సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
నిజం చెప్పాలంటే... జనవరిలో, సంక్రాంతి బరిలో మహేష్ బాబు సినిమా రావాల్సింది. తొలుత 'సర్కారు వారి పాట' సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. అభిమానులు కూడా ఆ సినిమా కోసం ఎంతో ఎదురు చూశారు. అయితే... 'ఆర్ఆర్ఆర్' కోసం 'సర్కారు వారి పాట'ను మహేష్ వాయిదా వేశారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో మహేష్ బాబు రాకపోయినా... ఆయన మేనల్లుడు జనవరిలో రావడానికి రెడీ అయ్యారు. మహేష్ బదులు మేనల్లుడిని చూడటానికి అభిమానులు థియేటర్లకు వెళతారన్నమాట.
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి