మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్లను విడుదల చేశారు. 

 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో చిరు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్ తో ఓ అనౌన్స్మెంట్ చేసింది చిత్రబృందం. జనవరి 3న సాయంత్రం 4:05 గంటలకు సినిమా నుంచి 'సానా కష్టం' అనే పాటను విడుదల చేయబోతున్నారు. ఇదొక హైవోల్టేజ్ పార్టీ సాంగ్ అని తెలిపింది చిత్రబృందం. మణిశర్మ మాస్ బీట్ కి చిరు స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 

 

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!







 


 




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి