తెలంగాణ ప్రభుత్వానికి తమ మద్దతు అందించాలని అనుకుంటున్నట్టు నటి, నిర్మాత లక్ష్మీ మంచు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి 'మన ఊరు - మన బడి' కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వార్త తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని లక్ష్మీ మంచు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగడంతో పాటు ఎంతో మంచి బాలికలు తమ కలలు సాకారం చేసుకుంది దిశగా అడుగులు వేయడానికి తోడ్పడుతుందని, అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని ఆమె అన్నారు.


మేం ప్రారంభించిన 'టీచ్ ఫర్ ఛేంజ్' స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ 42,608 మంది పిల్లలకు ప్రాథమిక విద్యను అందించామని... తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు అందించాలని అనుకుంటున్నట్టు లక్ష్మీ మంచి తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ లేఖలో పాఠశాల ప్రాంగణాల్లో సరైన టాయిలెట్ వసతులు లేకపోవడం వల్ల ప్రతి ఏడాది లక్షలాది మంది పిల్లలు స్కూల్ మానేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య కోసం భారత దేశం జీడీపీలో కేవలం మూడు శాతం మాగ్త్రమే కేటాయిస్తున్నారని అన్నారు. నాణ్యమైన విద్యను ఉచితంగా అందివ్వడం అనేది మన దేశంలో ప్రాథమిక హక్కు అని లక్ష్మీ మంచు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు.






Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి