Kalki 2898 AD Trailer: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. అసలు 8,848 మీటర్ల ఎత్తులోని మౌంట్ ఎవరెస్ట్ ను అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ మనుషులు అధిరోహించ గలరని ఎవ్వరూ ఊహించను కూడా లేదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే. 1953లో హిల్లరీ, నార్గే ఎవరెస్ట్ ను విజయవంతంగా అధిరోహించిన ఘనతను ప్రపంచమంతా కీర్తించింది. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సాహసికుల్లో ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని నింపింది ఆ సంఘటన. అది మొదలు ఈ రోజు వరకూ 11,996 సార్లు ఎవరెస్ట్ సమ్మిట్స్ జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 6వేల664మంది ఎవరెస్ట్ ను ఇప్పటివరకూ అధిరోహించారు. ఇదంతా ఎలా సాధ్యమైంది. ఏదైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. మొదట ధైర్యం చేసి ఒకరు వేసే అడుగు అనేక వేల అడుగులకు కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది మార్గదర్శనం చేస్తుంది. అలాగే ఇప్పుడు విడుదల అవుతున్న కల్కి సినిమా కూడా.


600 కోట్ల రూపాయల కలెక్షన్లను ఓ సినిమా సాధిస్తేనే ఇండియాలో అతిపెద్ద విజయం. అలాంటిది సినిమా తీయటానికే 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ ధైర్యాన్ని ఏమని మెచ్చుకోవాలి. సినిమా తీయటానికి 600కోట్లు ఖర్చుపెట్టారంటే దానికి ఎంత మార్కెట్ చేయాలి..ఆ సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తే సినిమా సేఫ్ అవుతుంది ఇవన్నీ ఊహించటానికే ఒళ్లు జలదరించే పోయే అంశాలు. బట్ ఈ మొండి ధైర్యానికి దారి చూపిన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతనే ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమా మార్కెట్ రేంజ్ ఏంటో ప్రపంచం అంతా తెలిసేలా చేశారు. ఆయన పదేళ్ల క్రితం ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు కేజీఎఫ్, పుష్ప ఇప్పుడు కల్కి లాంటి సినిమాలు భారీ స్కేల్ లో ఖర్చు పెట్టటానికి కలెక్షన్ల మార్కెట్ పై దృష్టి పెట్టడానికి కారణం అవుతున్నాయి. RRR సినిమా ద్వారా ఆస్కార్ కూడా అందుకున్న రాజమౌళి బృందం ఇండియన్ సినిమా తలుచుకుంటే సాధించలేని స్టేజ్ అంటూ ఏదీ లేదని విషయాన్ని స్పష్టం చేశాయి. 


Also Readహాలీవుడ్‌కు దిమ్మ తిరిగేలా కల్కి ట్రైలర్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్, ఇక రికార్డ్స్ చూసుకోండి


ఆ ధైర్యమే నాగ్ అశ్విన్ ను తన కలల ప్రాజెక్టు పై దృష్టి సారించేలా చేశాయి. మహానటి సావిత్రి నిజ జీవిత కథతో కీర్తి సురేష్ ను ప్రధానపాత్రగా పెట్టి 'మహానటి' సినిమా తీసిన నాగి కలెక్షన్లతో పాటు నేషనల్ అవార్డులను కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఐదేళ్లుగా ఆయన పూర్తిగా కల్కి 2898AD ప్రాజెక్టులోనే నిమగ్నమైపోయాడు. ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్లను ఓ ప్రాజెక్టు లోకి తీసుకురావటమే కాదు ప్రపంచవ్యాప్తంగా కల్కి అనే సినిమా ఒకటి వస్తోందని తెలిసేలా అనేక ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న బుజ్జి AI హ్యుమనాయిడ్ కారు కూడా ప్రమోషన్స్ లో ఓ భాగమే. మార్కెట్ ను సరిగ్గా అంచనా వేయటం, సరైన సమయం, కట్టిపడేసే కంటెంట్, కంటెంట్ మోయగలిగే క్యాస్ట్ అండ్ క్రూ..చాలా ఓ ఇండియన్ సినిమా ఎంత అద్భుతమైనా చేసి చూపించగలదని అప్పుడు బాహుబలి, RRR నిరూపిస్తే ఇప్పుడు అదే దారిలో నాగ్ అశ్విన్ నడుస్తున్నాడు. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే చాలు ఇండియన్ సినిమా మార్కెట్ పరిధి పదింతలు పెరుగుతుంది. ఫ్యూచర్ మేకర్స్ కి తమ కలలను ఆలోచనలను విస్తృత పరుచుకుని వాటిని వెండి తెరపైకి తీసుకురావటానికి కావాల్సిన ధైర్యాన్ని, మోరల్ సపోర్ట్ ను అందిస్తుంది. అందుకే కల్కి 2898 విజయం కోసం కేవలం ప్రభాస్ అభిమానులో..నాగ్ అశ్వినో లేదా వైజయంతీ మూవీస్ వాళ్లో కాదు మొత్తం దేశమే ఎదురు చూస్తోంది.


Also Read: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?