Prabhas Kalki 2898 AD Trailer Review In Telugu: క్లాస్... టాప్ క్లాస్... ఆ విజువల్స్ అండ్ యాక్టింగ్ టాప్ క్లాస్... ఇంటర్నేషనల్ ఆడియన్స్ ముందు ఇండియన్ సినిమా సగర్వంగా తలెత్తుకుని ధీటుగా నిలబడగల కంటెంట్... మూడు నిమిషాల పది సెకన్ల పాటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను మరోవైపు చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన రీసెంట్ ట్రైలర్ ఏది? అని ప్రశ్నిస్తే పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ చెప్పే ఒకే ఒక్క ఆన్సర్ 'కల్కి 2898 ఏడీ'.
అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా...
హాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలకు ధీటుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' జూన్ 10న పాన్ వరల్డ్ రిలీజ్ కానుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ జానర్ ఫాంటసీ ఫిల్మ్ ఇది. మన ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు... పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
Kalki 2898 AD Trailer Runtime: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ రన్ టైమ్ 3.10 మినిట్స్. ఈ సమయంలో కల్కి ప్రపంచంతో పాటు మెయిన్ స్టార్ క్యాస్ట్ క్యారెక్టర్లతో పాటు ఈ సినిమా కథను పరిచయం చేశారు నాగ్ అశ్విన్. వెండితెరపై దర్శకుడు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. దుష్టశక్తి నుంచి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను దూరం చేయడానికి కథానాయకుడు కల్కిగా ఎలా అవతరించాడు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.
భైరవగా ప్రభాస్ లుక్కు, ఆయన డైలాగ్ డెలివరీ సూపర్బ్. బుజ్జి (స్పెషల్ కార్) గ్లింప్స్ విడుదల చేసినప్పుడు... యాక్షన్ సీక్వెన్సులు ఏ స్థాయిలో ఉంటాయనేది చిన్న హింట్ ఇచ్చారు. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ చివరలో వచ్చే యాక్షన్ అయితే టాప్ క్లాస్ అంతే! హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించింది. ప్రభాస సహా మిగగా ప్రధాన తారాగణాన్ని సైతం చూపించారు. ''రికార్డ్స్ చూస్కో... ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు'' అని ప్రభాస్ చెప్పే డైలాగ్ అయితే విజిల్ వర్తీ అని చెప్పాలి. సీరియస్ యాక్షన్ సీన్స్ తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ చిరునవ్వులు పూయించింది. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. మరి, ట్రైలర్ ఎలా ఉందో విజువల్స్ లో చూడండి.
Also Read: దీపిక పోస్టర్ విడుదల చేసిన కల్కి టీమ్ - భర్త రణవీర్ కామెంట్ చూశారా?
Cast Of Prabhas Kalki 2898 AD Movie: ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటానీ కథానాయికలుగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్లు కీలక పాత్రలు చేశారు. తమిళ నటుడు పశుపతి ప్రధాన పాత్రలో కనిపిస్తారు. సీనియర్ హీరోయిన్ శోభన, యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. బుజ్జి కారుకు కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.