మలయాళీ భామ, కథానాయిక అమలా పాల్ (Amala Paul) ఈ ఏడాది జీవితంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఓ మధుర జ్ఞాపకం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే... ఈ ఏడాది ఆవిడ తల్లి కాబోతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో... జనవరి 3న తాను ప్రెగ్నెంట్ అని అమలా పాల్ అనౌన్స్ చేశారు. లేటెస్టుగా నిండు గర్భిణిగా ఉన్న తన వీడియో షేర్ చేశారు. 


బేబీ కమ్ డౌన్... కమ్ డౌన్!
Amala Paul Ready For Delivery: అమలా పాల్ శనివారం (జూన్ 8న) ఫుల్ బంప్ వీడియో షేర్ చేశారు. ''బేబీ కమ్ డౌన్... కమ్ డౌన్... అని సాంగ్ పాడే సమయం వచ్చింది'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో చూస్తే ఆవిడ నిండు చూలాలు అనేది సులభంగా అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆవిడకు తొమ్మిదో నెల వచ్చినట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ నెలలో ఎప్పుడైనా అమలా పాల్ డెలివరీ కావచ్చు. సో... గెట్ రెడీ టు హియర్ గుడ్ న్యూస్!


Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?






అండర్ ఆర్మ్స్ అలా వున్నాయేంటి?
బ్యాడ్ కామెంట్లకు రిప్లై ఇచ్చిన నెటిజన్!
Bad Comments On Amala Paul Bump Video: అమలా పాల్ బంప్ వీడియో చూసి పలువురు నెటిజనులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. తల్లి కాబోతున్న ఆనందం ఆమె కళ్లల్లో కనిపిస్తోందని అభిమానులు మురిసిపోయారు. అయితే... అమలా పాల్ ఆనందం మీద కంటే కొందరి చూపు ఆమె అండర్ ఆర్మ్స్ మీదకు వెళ్లాయి. అంత డార్క్ అయ్యాయి ఏమిటని ప్రశ్నించారు. కొంత మంది అయితే బ్యాడ్ కామెంట్లు చేశారు. మహిళలు గర్భవతిగా ఉన్న ఉన్నప్పుడు హార్మోన్స్ మార్పుల వల్ల అలా జరుగుతుందని, బ్యాడ్ కామెంట్లు చేసే వాళ్లకు ఆ మాత్రం తెలియదా? అని ఒక నెటిజన్ వివరించారు.


Also Readథియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'... రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్



నవంబరులో పెళ్లి... జనవరిలో ప్రెగ్నెన్సీ!
అమలా పాల్ గత ఏడాది నవంబర్ 6న జగత్ దేశాయ్ (Jagat Desai)తో వివాహ బంధంలో అడుగు పెట్టారు. పెళ్లి చేసుకోవడానికి సరిగ్గా పది రోజుల ముందు... అమలా పాల్ బర్త్ డే (అక్టోబర్ 26) నాడు ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియో జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాళ్లిద్దరి బంధం గురించి ఫ్యాన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరికీ తెలిసింది.   


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో', యువ సామ్రాట్ నాగ చైతన్య 'బెజవాడ'తో పాటు తెలుగులో అమలా పాల్ కొన్ని సినిమాలు చేశారు. తర్వాతర్వాత తమిళ, మలయాళ సినిమాలపై దృష్టి పెట్టారు. విక్రమ్ హీరోగా తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తీసిన 'నాన్న'లో ఆమె నటించారు. ఆ సినిమా సమయంలో ప్రేమలో పడి విజయ్, అమల పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్ నచ్చడంతో ఆయన్ను రెండో పెళ్లి చేసుకున్నారు.