Hansika Motwani warning to Hyper Aadi In Dhee: సిట్యువేషన్ ఏదైనా సరే కామెడీ చెయ్యగల ఆర్టిస్టుల్లో 'హైపర్' ఆది ఒకడు. ఎవరేం చెప్పినా కౌంటర్ వెయ్యగలడు. తన మాటలతో నవించగలడు. అతడి మాటలకు నవ్వే జనాలు ఎక్కువ. చనువు తీసుకుని మరీ సెలబ్రిటీల మీద జోకులు వెయ్యగలడు. జబర్దస్త్ కమెడియన్లు, శ్రీ దేవి డ్రామా కంపెనీలో తోటి ఆర్టిస్టులు, మిగతా నటీనటులపై వేసే పంచ్ డైలాగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఆదికి హన్సిక స్ట్రాంగ్ డైలాగులతో కూడిన వార్నింగ్ ఇచ్చింది. 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2 లేటెస్ట్ ప్రోమోలో ఆ వార్నింగ్ హైలైట్ అయ్యింది. ఎందుకు వార్నింగ్ ఇచ్చింది? అనే వివరాల్లోకి వెళితే...


నోరు మూసుకో ఆది... శేఖర్ మంచోడు!
జూన్ 12న టెలికాస్ట్ అయ్యే 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2'కు యంగ్ హీరో సుధీర్ బాబు గెస్టుగా వచ్చాడు. అతడు యాక్ట్ చేసిన 'హరోం హర' విడుదలకు రెడీ అయ్యింది. జూన్ 14న థియేటర్లలో సందడి చెయ్యనుంది. ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన సుధీర్ బాబు... శేఖర్ మాస్టారును పొగిడాడు. అప్పుడు ఆది వరుసపెట్టి శేఖర్ మీద సెటైర్లు వేశాడు.


''మీరు 'ఎస్ఎంఎస్' ఒక్కసారే చేశారు. కానీ, ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఎస్ఎంఎస్‌లు అందరికీ చేస్తూనే ఉన్నాడు. మీరు 'ప్రేమ కథా చిత్రం' చేశారు కదా! అందులో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు కదా! ఇక్కడ ఆయన్ను (శేఖర్ మాస్టర్) చూస్తే దెయ్యం పారిపోద్ది'' అని అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశాడు 'హైపర్' ఆది. అఫ్కోర్స్ అందరూ నవ్వారు. అయితే... సరదాగా అతడికి హన్సిక వార్నింగ్ ఇచ్చింది.


''ఏయ్... ఆది! శేఖర్ మాస్టర్ చాలా మంచి వాడు. నువ్వు నోరు మూసుకో'' అని హన్సిక అనేసరికి ఒక్కసారిగా 'హైపర్' ఆది షాక్ అయ్యాడు. శేఖర్ మాస్టర్ ఏమో టేబుల్ కొడుతూ తెగ సంతోషపడ్డాడు. దాంతో హన్సిక సహా అందరూ నవ్వేశారు.


Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?



ఇప్పుడే వెళ్ళిపో ఆది... హన్సిక మరో పంచ్!
హన్సిక తనకు వార్నింగ్ ఇచ్చేసరికి ''నాలుగో ఎపిసోడ్ కల్లా మీకు శేఖర్ మాస్టర్ గురించి తెలుస్తుంది'' అన్నాడు ఆది. వెంటనే ''ఎందుకు? నాలుగో ఎపిసోడ్ తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే వెళ్ళిపో'' అని మరో పంచ్ వేసింది. అవాక్కవ్వడం ఆది వంతు అయ్యింది.


Also Readథియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'... రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్


శేఖర్ మాస్టర్, హన్సికతో పాటు గణేష్ మాస్టర్ కూడా 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2'కు జడ్జిగా వ్యవహరించనున్నాడు. యంగ్ హీరో, సింగర్ గీతా మాధురి భర్త నందు యాంకరింగ్ చేస్తున్నాడు. 'ఢీ సెలబ్రిటీ స్పెషల్'కు కూడా అతడు యాంకరింగ్ చేశాడు. ఆదితో పాటు శ్రీ సత్య కూడా టీమ్ లీడర్. ప్రతి బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 గంటలకు షో టెలికాస్ట్ కానుంది.