Naga Panchami Today Episode ఘన, వైశాలిని కరాళి తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇక మోక్ష, పంచమిలు ఇంట్లో సుబ్రహ్మణ్యస్వామి పూజ చేస్తామని అంటారు. ఇక జ్వాల పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే పూజ చేద్దామని ఆ స్వామే కాపాడుతాడు అని అంటారు. ఇక మోక్ష పూజ సక్రమంగా చేస్తే పిల్లలు ఇంటికి వస్తారని అంటాడు. వరుణ్ పూజలో కూర్చొమని జ్వాలని ఒప్పిస్తాడు. అందరూ పూజలో కూర్చొంటారు. 


మరోవైపు కరాళి నాగదేవతని ప్రసన్నం చేసుకుంటుంది. నాగదేవత కనిపించగానే వైశాలి కనిపించడం లేదు అని నాగేశ్వరి చెప్తుంది. ఘన కూడా కనిపించడం లేదు అని చెప్తుంది. ఘనానే ఫణేంద్ర అని చెప్తుంది. ఘన కూడా కనిపించడం లేదు అంటే ఇది కరాళి పనే అని నాగేశ్వరి చెప్తుంది. తమకు వైశాలి ముఖ్యమని ఆమెని కాపాడాలి అని నాగదేవత చెప్తుంది. నాగలోకం యువరాణిని కాపాడుకోవాలి అని అందుకు కరాళితోనే తేల్చుకోవాలి అంటుంది. 


ఇక కరాళి క్షుద్రపూజలు చేస్తూ ఉంటుంది. పంచమి, మోక్ష, జ్వాల, వరుణ్‌లు కూడా హోమం చేస్తూ ఉంటారు. సుబ్బు(సుబ్రహ్మణ్యస్వామి) దయతో ఘన, వైశాలి పడుకుండిపోతారు. ఇక సుబ్బు కారళికి ప్రత్యక్షమవుతాడు. పంచమి మీద పగ తీర్చుకోవడం అసాధ్యం అని సుబ్బు చెప్పి.. ఈ క్షణం నుంచి నువ్వు అన్నీ మర్చిపోయి ఇక్కడే నక్కలా ఈ అడవిలో తిరిగి నీ తనువు చాలిస్తావ్ అని నక్కలా కరాళిని మార్చేస్తారు. ఇక వైశాలిలోని విశాలాక్షి ఆత్మను పరమాత్మలో కలిపేస్తారు. ఇక ఘనలోని గరుడరాజును కూడా పంపేస్తాడు. ఫణేంద్రను క్షమించి యథాప్రకారం ఫణేంద్రకు నాగశక్తులు ఇస్తాడు సుబ్బు. ఇక నాగేశ్వరి, నాగదేవత కూడా అక్కడికి వస్తారు. 


సుబ్బు: మీ నాగలోకానికి రాణి లేని లోటు త్వరలోనే తీరుతుంది.
నాగదేవత: పంచమి కడుపులో పుట్టిన ఈ వైశాలినే నాగలోక యువరాణి స్వామి.
సుబ్బు: నాగలోక యువరాజు ఫణేంద్ర తన తప్పు తాను తెలుసుకున్నాడు. తనని క్షమించి నాగలోకం పంపించాను. నాగలోకానికి నాగేశ్వరి నమ్మిన బంటు. ఫణేంద్రకు నాగేశ్వరికి కలగబోయే బిడ్డ నాగలోక యువరాణి అవుతుంది. 
నాగేశ్వరి: అదృష్టవంతురాలిని స్వామి నాకు గొప్ప వరం ప్రసాదించారు.
నాగదేవత: స్వామి మా నాగలోకానికి యువరాణిని ప్రసాదించినందుకు ఎప్పటిలా మా నాగలోకం మిమల్ని పూజించుకుంటుంది.


సుబ్బు ఘన, వైశాలిని లేపి ఇద్దరినీ తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. ఇంతలో పూజ కూడా అయిపోతుంది.  ఇక మోక్ష పూజ అయిపోయిందని మోక్ష తాను తన భార్య పిల్లలతో కట్టుబట్టలతో వెళ్లిపోతామని చెప్తాడు. జ్వాల తన కొడుకుని తనకి ఇచ్చిన తర్వాతే వెళ్లమంటుంది. పంచమి ఈ కష్టాలు అన్నీ తన వల్లే అని ఈ క్షణమే తన జన్మను చాలిస్తాను అని అంటుంది. అక్కడే ఉన్న హోమ అగ్నిలోకి ప్రవేసిస్తుంది. ఇంతలో సుబ్బు పంచమి అని పిలుస్తాడు. వైశాలి, ఘనలు తమ తల్లుల దగ్గరకు వెళ్తారు. అందరూ ఎమోషనల్ అవుతారు. పంచమి సుబ్బుని నువ్వే తన దేవుడు అని అంటుంది. ఇక సుబ్బు నీ ఇద్దరు పిల్లల్ని ఎవరూ తీసుకెళ్లలేరు అని అంటాడు. 


సుబ్బు: మీ ఇంటి గురించి నాకు ఓ కల వచ్చింది. మీ వంశానికి పెద్ద శాపం ఉంది అంట. ఆ శాపాన్ని పొగొట్టడానికి పంచమి మీ ఇంట్లో అడుగు పెట్టి ఆ శాపం పొగొట్టింది అంట. ఆ తర్వాత మీరంతా కలిసి సంతోషంగా ఉన్నారు అంట. 
 వైదేహి: చిన్న పిల్లాడివి అయినా చాలా గొప్పగా చెప్పావు బాబు. నీ కలని మేం నిజం చేస్తాం. అందరం కలిసి సంతోషంగా ఉంటాం.
సుబ్బు: ఇక్కడ నా విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. వెళ్లొస్తా పంచమి, మోక్ష.
మోక్ష: పంచమి సుబ్బుతో చెప్పు కొన్ని రోజులు అయినా మన ఇంట్లో ఉండమని. ఎలా అయినా ఒప్పించు.


పంచమి సుబ్బు వెనకాలే వెళ్తుంది. నిన్ను చూడకుండా ఉండలేను అని కొన్ని రోజులు అయినా నాతో ఉండు అని అంటుంది. సుబ్బు పంచమిని దీవించి బయల్దేరుతాడు. సుబ్బు సుబ్రహ్మణ్య స్వామిలా మారడం పంచమి చూసి షాక్ అయిపోతుంది. ఆనందంతో సుబ్బుని దండం పెట్టుకుంటుంది. ఇంతలో అందరూ బయటకు వస్తారు.  అందరూ సుబ్బుని దండం పెట్టుకుంటారు. దీంతో నాగపంచమి సీరియల్‌కు శుభం కార్డు పడుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి.. సీరియల్‌కు శుభం కార్డు - కలిసిపోయిన కృష్ణ, ముకుంద, చివరి ఎపిసోడ్‌ ఇలా ముగిసింది