The Trial actress Noor Malabika Das dies by suicide: హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మరొక నటి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ముంబై మహా నగరంలోని లోఖండవాలా ఏరియాలో గత గురువారం (జూన్ 6న) ఓ మరణం చోటు చేసుకుంది. నటి నూర్ మాళవికా దాస్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంతకీ, ఆవిడ ఎవరు? అసలు ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే...
నూర్ వయసు 37... వచ్చింది అస్సాం నుంచి!
ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ట్వీట్ చేయడంతో నూర్ మాళవికా దాస్ మరణం వెలుగులోకి వచ్చింది. ఆవిడ వయసు 37 ఏళ్లు అని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది. ఆవిడ సొంతూరు అస్సాం అని తెలుస్తోంది. లోఖండవాలాలో ఆమె ఇరుగుపొరుగు వ్యక్తుల ఫిర్యాదుతో ఫ్లాట్ తలుపులు తెరిచిన పోలీసులకు నూర్ పార్థీవ దేహం కనిపించిందని తెలిసింది. ప్రాథమిక దర్యాప్తులో ఆవిడది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు.
హిందీ ఇండస్ట్రీలోకి రాకముందు నూర్ ఏం చేసింది?
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటిగా ప్రవేశించక ముందు నూర్ మాళవికా దాస్ ఎయిర్ హోస్టెస్ (Noor Malabika Das Air Hostess)గా కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఖతార్ ఎయిర్ వేస్ లో ఆవిడ ఎయిర్ హోస్టెస్ అట! నటి కావాలని ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఇటీవల నూర్ తల్లిదండ్రులు వచ్చి ఆమెను కలిసి వెళ్లారట. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో నూర్ స్నేహితుడు, నటుడు ఆలోకనాథ్ పాఠక్ ఆమె అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
Also Read: లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?
హిందీలో నూర్ ఏయే వెబ్ సిరీస్, ఫిలిమ్స్ చేశారు?
నటిగా నూర్ మాళవికా దాస్ చేసిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గది, అతి ముఖ్యమైనది బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కాజోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లీగల్ డ్రామా 'ది ట్రయిల్'. ఆ సిరీస్ ఆమె చేసిన బిగ్గెస్ట్ సిరీస్. ఆవిడకు ఫిట్నెస్ అంటే ప్రాణం అని సోషల్ మీడియా ఖాతా చూస్తే తెలుస్తోంది. పలు జిమ్, వర్కవుట్ వీడియోలు షేర్ చేశారు. 'ది ట్రయిల్' కాకుండా నూర్ నటించిన మిగతా ప్రాజెక్టులు చూస్తే... అడల్ట్ వెబ్ సిరీస్‌లు ఎక్కువ ఉన్నారు. 'సిస్కియాన్', 'వాక్ మ్యాన్', 'టీకి చట్నీ', 'ఛర్మ్ సుఖ్', 'దేఖి అందేఖి', 'బ్యాక్ రోడ్ హుస్ట్లే' వంటి వాటిలో నూర్ నటించింది.