Deepika Padukone new poster from Kalki 2898 AD movie: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల ఎదురు చూపులకు తెరపడే సమయంలో రానే వచ్చింది. జూన్ 10వ తేదీ సాయంత్రం ట్రైలర్ విడుదల కానుంది. దీనికి ముందు సినిమాలో హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone) అభిమానులకు చిత్ర బృందం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా నుంచి ఆమె కొత్త పోస్టర్ విడుదల చేసింది.


భూమ్... స్టన్నర్... కామెంట్ చేసిన రణవీర్!
Ranveer Singh comments on Deepika Padukone post: 'The hope begins with her' అంటూ 'కల్కి 2898 ఏడీ' టీమ్ ఇవాళ దీపికా పదుకోన్ పోస్టర్ (కొత్త లుక్) విడుదల చేసింది. దీపిక సైతం ఆ పోస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దాని కింద 'B O O M stunner !' అని ఆమె భర్త, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కామెంట్ చేశారు.


'కల్కి'లో దీపికా పదుకోన్ కొత్త పోస్టర్ తెలుగు అమ్మాయి, హిందీలోనూ సినిమాలు చేసిన హీరోయిన్ శోభితా ధూళిపాళకు సైతం విపరీతంగా నచ్చింది. 'వావ్' అని ఆవిడ కామెంట్ చేశారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు దీపిక మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?






హాలీవుడ్ స్థాయిలో తీస్తున్న తెలుగు సినిమా!
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD Movie) మీద భారతీయ ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భాషలకు అతీతంగా దేశవ్యాప్తంగా సినిమాను అభిమానించే వారి దృష్టి ప్రభాస్ అండ్ టీమ్ మీద ఉంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న తెలుగు సినిమా 'కల్కి 2898 ఏడీ' అని ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనికి ప్రభాస్ హాలీవుడ్ డెబ్యూగా అభిమానులు చూస్తున్నారు. ట్రైలర్, సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.


Also Readథియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'... రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్


Kalki 2898 AD release date: వైజయంతీ మూవీస్ సంస్థలో దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన సి అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా కంటే ముందు 'బుజ్జి అండ్ భైరవ' పేరుతో రెండు ఎపిసోడ్స్ గల వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల చేశారు. బుజ్జి కారు, ప్రభాస్ పాత్రలు ఎలా ఉంటాయనేది అందులో చూపించారు. దానికి మంచి రెస్పాన్స్ లభించింది.



'కల్కి 2898 ఏడీ' సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషించారు. కమల్ విలన్ రోల్ చేశారని తెలుస్తోంది. అయితే, ఆయన లుక్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. 'అశ్వత్థామ'గా అమితాబ్ బచ్చన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.