Sree Leela is making her Bollywood debut with Ibrahim Ali Khan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన అందాల భామల జాబితా తీస్తే... అందులో తెలుగు అమ్మాయి శ్రీ లీల పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడీ అమ్మాయి హిందీకి వెళుతోందని, ఓ బాలీవుడ్ సినిమాకు సంతకం చేసిందని, అక్కడ ఇబ్రహీం ఖాన్ సరసన నటించనుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...
సైఫ్ అలీ ఖాన్ కొడుకు సినిమాలో శ్రీ లీల?
ముంబై సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఖాన్ హీరోల్లో ఒకడు, పటౌడీ ఫ్యామిలీ వారసుడు, సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ హీరోగా పరిచయం కానున్నాడు. ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్న ఆ సినిమాకు 'దిలేర్' (Diler Hindi Movie) పేరు ఖరారు చేశారట. అందులో కథానాయికగా శ్రీ లీల పేరు వినబడుతోంది.
అవును... అన్నీ కుదిరితే సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో 'దిలేర్' సినిమాలో శ్రీ లీల యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. శ్రీ లీల ఓకే అనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.
హిందీ సినిమా ఇండస్ట్రీలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కు మంచి పేరు ఉంది. ఆయన మొదటి భార్య అమృతతో కలిగిన సంతానమే ఇబ్రహీం ఖాన్. ఇబ్రహీం సోదరి సారా అలీ ఖాన్ ఆల్రెడీ కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. అమృతకు విడాకులు ఇచ్చి కరీనాను సైఫ్ పెళ్లి చేసుకున్నప్పటికీ... మొదటి భార్యతో, పిల్లలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, సైఫ్ - కరీనా కూడా ఇబ్రహీంకు సపోర్ట్ చేస్తారు. సో... శ్రీ లీల ఓకే అంటే ఆవిడకు హిందీలో గ్రాండ్ ఎంట్రీ లభించినట్టే.
Also Read: లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?
తెలుగులో తక్కువ సమయంలో స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన ముద్దుగుమ్మల జాబితాలో కూడా శ్రీ లీల పేరు ఉంటుంది. వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ అందాల భామకు 'గుంటూరు కారం' తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు నటించే అవకాశం ఆమెకు అంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ మాటకు వస్తే... శ్రీకాంత్ కొడుకు రోషన్ సరసన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ లీల, వెంట వెంటనే రవితేజ 'ధమాకా', రామ్ పోతినేని 'స్కంద', బాలకృష్ణ 'భగవంత్ కేసరి', వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' వరకు వరుసగా సినిమాలు చేశారు. ఇప్పుడు రవితేజతో మరోసారి ఆవిడ సినిమా చేయనున్నారు. 'సామజవరగమన' రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆవిడ హీరోయిన్.