Kamal Haasan: కమల్ తప్ప ఇంకొకరు చేయగలరా? ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా 'కల్కి'లో లుక్... ఎంత మంది గుర్తు పట్టారు?

Kalki 2898 AD Trailer Review: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఈ ట్రైలర్ కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు సైతం ఆనందాన్ని ఇచ్చింది. కిక్ ఇచ్చేలా ఆయన లుక్ ఉంది.

Continues below advertisement

Kamal Haasan Look in Kalki 2898 AD: 'కల్కి 2898 ఏడీ' సినిమాలో యూనివర్సల్ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారని ఈ సినిమాకు సంతకం చేసినప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే... ఇప్పటి వరకు ఆయన లుక్ విడుదల చేయలేదు. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్ (Kalki 2898 AD Trailer)లో కమల్ లుక్ రివీల్ చేశారు.

Continues below advertisement

కమల్ హాసన్ తప్ప ఇంకొకరు చేయగలరా?
Kamal Haasan Role In Kalki 2898 AD: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఎంత కిక్ ఇచ్చిందో... అంత కంటే ఎక్కువ కిక్ కమల్ అభిమానులకు ఇచ్చిందని చెప్పాలి. చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఏరి కోరి మరీ లోక నాయకుణ్ణి ఎందుకు ఎంపిక చేశారో ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 

రెగ్యులర్ రోల్స్ కంటే డిఫరెంట్ రోల్స్ చేయడానికి కమల్ హాసన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తెరపై కొత్తగా కనిపించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడరు. ప్రోస్థటిక్ మేకప్ ఆయనకు కొత్త కాదు. 'భారతీయుడు' కోసం 28 ఏళ్ల క్రితం వయసు మీరిన వ్యక్తిగా ఓల్డ్ లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ వాడారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ'తో పాటు 'ఇండియన్ 2' కోసం మరొకసారి వాడారు. 

'కల్కి' ట్రైలర్ చూసిన తర్వాత కమల్ అభిమానులకు, ప్రేక్షకులకు వచ్చిన సందేహం ఆయన ఏలియన్ రోల్ చేస్తున్నారా? అని! కొంత మంది ప్రేక్షకులు అయితే కమల్ హాసన్ (Kamal In Kalki)ని గుర్తు పట్టలేదు కూడా! 'ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి' అని హీరోయిన్ దీపికా పదుకోన్ డైలాగ్ చెబుతారు కదా! అప్పుడు... ట్రైలర్‌లో సరిగ్గా 2.40 నిమిషాల దగ్గర కమల్ ఎంట్రీ ఇచ్చారు.

Kamal Haasan Dialogue in Kalki 2898 AD: 'భయపడకు... మరో ప్రపంచం వస్తోంది' అని దీపికా పదుకోన్ చెవిలో డైలాగ్ చెప్పేది కమల్ హాసనే. గుండుతో డిఫరెంట్ లుక్కులో కనిపించారు. కమల్ విలన్ అనేది ఆ మాటతో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు కొందరు.

Also Read: హాలీవుడ్‌కు దిమ్మ తిరిగేలా కల్కి ట్రైలర్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్, ఇక రికార్డ్స్ చూసుకోండి

'కల్కి 2898 ఏడీ' పార్ట్ 1లో కమల్ నిడివి ఎంత?
'కల్కి 2898 ఏడీ' మొదలైనప్పుడు ఒక్కటే సినిమా అనుకున్నారు. అయితే... షూట్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు పార్టులుగా విడుదల చేయాలని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, నిర్మాతలైన ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్ణయించుకున్నారట. 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్ అని అనౌన్స్ చేశారు కానీ రెండు పార్టులుగా సినిమా విడుదల చేస్తామని చెప్పలేదు. ఈ సినిమా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... రెండు పార్టుల్లోగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట. మొదటి పార్టులో కమల్ క్యారెక్టర్ నిడివి తక్కువే అని, రెండో పార్టులో ఎక్కువ ఉంటుందని టాక్.

Also Readఅమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?

Continues below advertisement