టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టింది. ముందుగా 'యశోద' అనే సినిమాను పట్టాలెక్కించింది. నెల రోజుల క్రితం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. 


తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుందట. కొన్నిరోజుల క్రితం సినిమాలో ఆమె నర్స్ పాత్ర పోషించనుందని అన్నారు. దానికి తగ్గట్లే రామానాయుడు స్టూడియోస్ లో హాస్పిటల్ సెట్ వేసి సమంతపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. దీన్ని బట్టి సినిమాలో ఆమె వృత్తి రీత్యా నర్స్ అయిన గర్భిణిగా కనిపించబోతుందన్నమాట. 


సమంత పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కావడంతో.. కథ మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 


ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


ఈ సినిమా తరువాత తాప్సి నిర్మాణంలో బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతుంది సమంత. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇది కాకుండా.. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఆమె లిస్ట్ లో ఉంది. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది సామ్. 


Also Read: బ్రహ్మానందం పెర్ఫార్మన్స్ కి కృష్ణవంశీ కన్నీళ్లు..


Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?


Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..


Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..


Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..


Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి