కళ్లు కనిపించవు ఊర్లోకి వెళ్లి ఓ ముద్ద అడుక్కుందామంటే... కాళ్లు ముందుకు సాగవు ఏదైనా పని చేసుకుందామంటే. వృద్ధాప్య పింఛను అందని ఓ అనాథ వృద్ధుడి ఆవేదన ఇది. ఎన్నికల సమయాల్లో చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఓట్లు వేయించుకుంటారు. నీకు సహాయం చేస్తామంటారు ఆ తర్వాత ఇటువైపు చూడరు. 



Also Read: ఏపీలో స్కూళ్లు కొనసాగింపు.. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం !


ఆధార్ లో వయసు తప్పుగా నమోదు


అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న తట్టి ఆదినారాయణకు 75 ఏళ్ల వయసు. పింఛన్ కు అర్హత ఉన్నా మంజూరు చేయడంలేదని ఆవేదన చెందుతున్నారు. భూములు ఉన్న భూస్వాములకు పింఛన్ అందుతోంది. మాలాంటి నిరుపేదలను ఎవరు పట్టించుకునేవారు లేర అయ్యా.. అంటూ ఆ వృద్ధుని ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఆ వృద్ధుడికి భార్య పిల్లలు ఎవరూ లేరు. ఓ వ్యక్తి దయతలచి పెడుతున్న అన్నం తిని కాలం వెళ్లబోసుకున్నాడు ఆ వృద్ధుడు. పింఛన్ కోసం ఎంపీడీవో కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగినా అధికారులు కనికరించలేదని వాపోతున్నాడు ఆ వృద్ధుడు. తన వయసు 75 ఏళ్లు అయితే ఆధార్ లో మాత్రం 56 ఏళ్లుగా ధ్రువీకరించారని అంటున్నాడు. దీంతో పింఛన్ కు అర్హుడు కాకపోవడంతో అతనికి పింఛన్ మంజూరు కాలేదు. ఈ విషయం వాలంటీర్లకు పలుమార్లు విన్నవించుకున్నా అతని బాధను ఎవరు అర్థం చేసుకోలేదు అన్నాడు ఆ వృద్ధుడు. కొత్తగా ఎన్నికైన అధికార పార్టీ నాయకుడు మండల ప్రజా ప్రతినిధి కాళ్లు పట్టుకొని, కన్నీటితో వేడుకున్నాడు ఆ వృద్ధుడు.


Also Read: నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !


సాయం కోసం ఎదురుచూపులు


ఎవరైనా సాయం చేయకపోతారా అన్న ఆశతో ఆదినారాయణ ఎదురుచూస్తున్నారు. ఆధార్ లో తన వయసు తప్పుగా నమోదు చేశారని, దానిని మార్చుకునే విధానం చెప్పి తనకు సాయం చేయాలని కోరుతున్నారు. గ్రామంలోని వాలంటీర్లకు ఈ విషయాన్ని తెలిపిపానని, వయసు మార్పుచేసుకుంటేనే పింఛన్ కు అర్హులని చెప్పారన్నారు. తనకు ఏ ఆధారంలేదని కనీసం పింఛన్ అయినా ఉంటే రోజు గడిచే మార్గం కనిపిస్తుందని ఆదినారాయణ ఆవేదన చెందుతున్నారు.  


Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి