తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో లోకేష్ ప్రకటించారు. తనకు లక్షణాలేమీ లేవని... ఎలాంటి అనారోగ్యం లేదని హోంఐసోలేషన్‌లో ఉన్నానని లోకేష్ ప్రకటించారు. తనను కలిసి న వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ
గత వారం రోజులుగా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఈ ఉదయమే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ ట్వీట్ చేశారు. కాసేపటికే తనకు కరోనా సోకిందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు ఇతర చోట్ల కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూంటారు. తొలి రెండు వేవ్‌లలో అందుకే టీడీపీ ఆఫీసు సిబ్బంది కూడా పెద్దగా కరోనా బారిన పడలేదు . కానీ ధర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్‌కు కూడా సోకింది.
Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !
తనకు కరోనా సోకినట్లుగా లోకేష్ పెట్టిన ట్వీట్‌కు టీడీపీ కార్యకర్తలు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కరోనా ధర్డ్ వేవ్ అన్ని చోట్లా తీవ్రంగా విస్తరిస్తోంది. అయితే ఎక్కువ మందికి అతి స్వల్ప లక్షణాలు.. లేదా లక్షణాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య .. మెదటి, సెకండ్‌వేర్‌తో పోలిస్తే తక్కువే. అయినప్పటికీ ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాయి.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి