AP CM Covid Review : ఏపీలో స్కూళ్లు కొనసాగింపు.. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం !

ఏపీలో కరోనా వ్యాప్తిని పరిశీలించి స్కూళ్లకు సెలవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు.

Continues below advertisement

కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌లు విస్తరిస్తున్న కారణంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని వస్తున్న డిమాండ్‌పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ కోవిడ్ పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిచారు. ఇందులో స్కూళ్ల నిర్వహణ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సంక్రాంతి సెలవుల అనంతరం యథావిధిగా స్కూళ్లు కొనసాగుతాయి. ఆదివారంతో సంక్రాంతి సెలవులు ముగిసిపోయాయి.  తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించడంతో ఏపీ ప్రభుత్వం కూడా అ దిశగా నిర్ణయం తీసుకుంటుందన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. అయితే పరిస్థితిని గమనించి..  కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు సెలవులు ప్రకటించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 

Continues below advertisement

Also Read: నారా లోకేష్‌కు కరోనా - హోం ఐసోలేషన్‌లో చికిత్స !

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కోవిడ్ పరిస్థితులపై సమీక్ష సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధులకు ఇప్పుడు ఇస్తున్న ప్రికాషన్ డోస్ లేదా బూస్టర్ డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కుదిరితే ఇంకా తగ్గించాలని కోరనున్నారు. 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయానికి వచ్చారు.  

Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

ప్రికాషన్ డోస్ వ్యవధిని తగ్గించడం వల్ల  ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమీక్షా సమావేశంలో  ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా కరోనా సోకినప్పటికీ ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందని సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. సమీక్షలో కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. 

ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.  ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.కోవిడ్‌ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్‌ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని సీఎంకు అధికారులు తెలిపారు.

Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
Continues below advertisement