ప్రముఖ హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందు నుంచే మీడియాలో వార్తలు వచ్చాయి. యూట్యూబ్ లో చాలా వీడియోలు కూడా వచ్చాయి. ఇక అఫీషియల్ గా చెప్పిన తరువాత సమంతను టార్గెట్ చేస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. సమంత విడాకులకు కారణమిదే అంటూ విశ్లేషణలు చేసేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో అయితే ఆమెకి ఎఫైర్ ఉందంటూ ప్రచారం జరిగింది. దీంతో సమంత తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా కేసు వేసింది. 


Also Read: పవన్ సినిమాకి అమెజాన్ క్రేజీ ఆఫర్.. మరి ఓటీటీలో రిలీజ్ చేస్తారా..?


హైదరాబాద్ కూకట్ పల్లిలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వ్యవహరించాయని సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులున్నాయని.. సమంత-నాగచైతన్య విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోరు విచారణ చేపట్టింది. 


సోమవారం నాడు సమంత దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి వాదనలు జరిగాయి. సమంత ప్రతిష్టను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుని కోరారు. సమాజంలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిపై ఇలా ఆరోపణలు చేస్తూ.. తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదంటూ కోర్టుకి చెప్పారు. యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టికి సంబంధించిన కేసులో ఇలానే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు తీర్పుని రేపటికి రిజర్వ్ చేసింది. 


Also Read: బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్.. తట్టుకోలేక ఏడ్చేసిన హౌస్ మేట్స్..


Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..


Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి


Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?


Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్


Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి