బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న ఇంటి సభ్యులు ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టారు. ఒక్కో వారం ఒక్కో స్టైల్లో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కూడా విభిన్నంగా జరిగింది. ఈ సారి లేఖలతో నామినేషన్ డిసైడ్ చేశారు బిగ్ బాస్.


Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..


'మీ ప్రియమైన వారి నుంచి వచ్చే ఒక లేఖ ఎంతో అమూల్యమైనది' అంటూ బిగ్ బాస్ చెప్పే డైలాగ్ తో ప్రోమో మొదలైంది. ముందుగా లోబో, ప్రియాంకలకు లేఖల్లో ఒకరు లేఖ తీసుకోవాలి.. మరొకరు త్యాగం చేయాలి. ప్రియాంకకు తన తల్లిదండ్రుల నుంచి లేఖ రావడంతో అదే విషయాన్ని లోబోకి చెప్పి ఆయన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. 'చాలా సంవత్సరాల నుంచి నేను మా నాన్నగారితో సరిగ్గామాట్లాడలేదు' అంటూ చెప్తూ కనిపించింది ప్రియాంక. 


ఆ తరువాత సిరి, షణ్ముఖ్ లలో ఒకరికి మాత్రమే లేఖ తీసుకునే ఛాన్స్ రావడంతో 'కనీసం నువ్వైనా తీస్కో' అంటూ షణ్ముఖ్ కి చెప్తూ కనిపించింది సిరి. ఆ తరువాత లోబో.. రవిని ఉద్దేశిస్తూ.. 'నీకు వదిన పంపిన లేఖ ఉంది.. డాల్ ఉంది.. టీషర్ట్ ఉంది.. తనకేం రాలేదు' అంటూ శ్రీరామ్ కి ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. 


ఇక ప్రియాంక 'ఐ కాంట్ డూ దిస్' అంటూ మానస్ లేఖను చించడానికి ఇష్టం లేదని చెప్తూ కనిపించింది. ఆ తరువాత విశ్వ ఏడుస్తూ.. సిరిని ప్లీజ్ చేయగా.. తీస్కో అంటూ సిరి లెటర్ ఇచ్చేసింది. 'నువ్ లేకపోతే నా జీవితంలో ఇంకేం లేదు నిక్కు' అంటూ యానీ మాస్టర్ ఏడుస్తూ చెబుతోంది. ఆ తరువాత షణ్ముఖ్ 'అమ్మా.. క్యాన్సర్ వచ్చినప్పుడు సర్వైవ్ అయ్యావ్.. అమ్మమ్మ చనిపోయినప్పుడు సర్వైవ్ అయ్యావ్.. నువ్వే నా ఇన్స్పిరేషన్.. ఐ విల్ సర్వైవ్ దిస్' అంటూ ఏడ్చేశాడు.





 Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి


Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?


Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్


Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి