సినిమా షూటింగ్ సమయంలో నటులు, టెక్నీషియన్స్ మధ్య చిన్న చిన్న విబేధాలు, సమస్యలు రావడం కామన్. హీరో, హీరోయిన్ల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. అయినా కూడా ఏదో విధంగా సినిమాను పూర్తి చేసి సైలెంట్ అయిపోతారు. అంతేకానీ.. అసలు మొహం కూడా చూసుకోకుండా.. కాంబినేషన్ సీన్లు చేయకుండా ఉండేంత వ్యవహారం ఉండదు. కానీ 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ చివరి రెండు నెలలు హీరో, హీరోయిన్లు ప్రభాస్-పూజాహెగ్డే అసలు మాట్లాడుకోలేదని.. ఒకరికొకరు ఎదురుపడలేదని తెలుస్తోంది. 


Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి


ఇద్దరి కాంబినేషన్ సీన్లు కూడా వేరువేరుగా గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరించి.. మళ్లీ ఎడిటింగ్ లో ఒక్కటిగా చూపించారని తెలుస్తోంది. ఈ విషయంపై కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చినా.. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వాటిని ఖండించింది. ప్రభాస్, పూజాహెగ్డే మధ్య అసలు ఎలాంటి గొడవలు లేవని.. పూజాహెగ్డే సెట్ లో చాలా బాగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 


కానీ ప్రభాస్ తో పూజాకి పడలేని మాట నిజమేనట. ఈ విషయాన్ని పూజాహెగ్డే తన స్నేహితుల దగ్గర కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు రావడం లేదు. కలిసి పని చేయాల్సినప్పుడు కూడా పని చేయకుండా.. సినిమా క్వాలిటీ ఎలా వస్తుందనేది ఆలోచించకుండా.. కాంబినేషన్ సీన్లను కూడా గ్రీన్ మ్యాట్ లో చేయడమంటే.. గొడవకి బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో.. ఆ ఇద్దరికీ మహా అయితే యూవీ క్రియేషన్స్ వారికి మాత్రమే తెలిసి ఉండాలి. 


కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. పూజాహెగ్డే ఓ రోజు చెప్పకుండా షూటింగ్ ఎగ్గొట్టేసిందట. దీంతో ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో వెయిట్ చేయాల్సి వచ్చిందట. మరొక రోజు గంటల పాటు క్యారవాన్ లోనే ఉండిపోయింది. ఆమె బిహేవియర్ తో విసిగిపోయిన ప్రభాస్.. ఆమెకి దూరంగా జరిగిందని టాక్.  


Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?


Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్


Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి