స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలి ఉంది. అలానే ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాల్సి వుంది. దీనికి మరో రెండు వారాలైనా.. సమయం పట్టేలా ఉంది. 

 


 

ఆ తరువాత మిగిలిన మూడు, నాలుగు వారాల్లో ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాను అనుకున్న ప్రకారం విడుదలకు సిద్ధం చేయడమంటే.. అంత సులువైన విషయం కాదు. ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని రాత్రింబవళ్లు సుకుమార్ కష్టపడుతున్నారట. సినిమాలో మిగిలిన చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణను వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తూ సుకుమార్ తన అసిస్టెంట్స్ తో షూట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఆయన ఎడిటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. సుకుమార్ తన సినిమాలో ప్రతీ షాట్ ను డిఫరెంట్ యాంగిల్స్, షాట్స్ లో తీస్తుంటారు. వాటిలోనుంచి బెస్ట్ షాట్ ను ఎన్నుకొని మిక్సింగ్ చేయిస్తారు. అందుకే సుకుమార్ సినిమాల ఎడిటింగ్ కు చాలా సమయం పడుతుంటుంది. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ సమయంలో అంతకముందు షూట్ చేసిన రషెస్ ను కొంతవరకు ఎడిటింగ్ చేయించిన సుకుమార్.. ఇప్పుడు పూర్తిస్థాయి ఎడిటింగ్ లో మునిగిపోయారు. అలానే ఇతర భాషల్లో డబ్బింగ్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. మిగతా భాషల కంటే చిత్తూరు యాసలో సాగే తెలుగు డబ్బింగ్ వర్క్ కే ఎక్కువ టైం పడుతుందట. ఎంత కష్టమైనా సరే.. సినిమాను డిసెంబర్ 17న విడుదల  ఫిక్సయిపోయారు సుకుమార్. 

 


 















ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి