'రిపబ్లిక్' సినిమా విడుదలకు ముందు హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. అందువల్ల, ఆయన ప్రచార కార్యక్రమాలకు రాలేదు. ఆ సినిమాను చూడనూ లేదు. అంటే... థియేటర్‌కు వెళ్లి చూడటం ఆయనకు వీలు పడలేదు. అప్పట్లో సాయి తేజ్ ఎక్కువగా ఎవరినీ కలవలేదు కూడా! మధ్యలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఓ పండక్కి మెగా ఫ్యామిలీ హీరోలతో కలిసిన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆయన ఫొటోలు వచ్చాయి. అయితే, ఆ ఫొటోల్లో ఆయన ఫేస్ కనిపించలేదు. కానీ, దర్శకుడితో పాటు ఇతర బృందంతో కలిసి సినిమా చూసినట్టు తెలుస్తోంది.
'రిపబ్లిక్' సినిమా శుక్రవారం (నవంబర్ 26న) 'జీ 5' ఓటీటీ వేదికలో విడుదల అయ్యింది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన సాయి ధరమ్ తేజ్, ఓటీటీలో చూశారు. చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్-ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ బి.కె.ఆర్ సతీష్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి ఆయన సినిమా చూశారు. సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు.
Also Read: సినిమాతో పాటు దర్శకుడి మాటలు వినిపిస్తే? ఇండియాలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దేవ్ కట్టా 'రిపబ్లిక్'
ఓటీటీ వేదికలో డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమా విడుదలైంది. మామూలుగా సినిమా చూడాలని అనుకున్న చూడవచ్చు. దర్శకుడి కామెంటరీతో చూడాలని కోరుకునే వారు... కామెంటరీతో చూడవచ్చు. రెండు ఆప్షన్స్‌లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. 'రిపబ్లిక్' ఎడిటర్ కె.ఎల్. ప్రవీణ్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ బి.కె.ఆర్. సతీష్... ముగ్గురితో సినిమా గురించి దేవ కట్టా డిస్కస్ చేశారు.
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు చిరంజీవి సాయం! మాస్టర్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని...
Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
Also Read: ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి