కరోనా సోకడంతో నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన చికిత్సకు రోజుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని, తమ దగ్గర అంత డబ్బు లేదని, ఆర్ధిక సాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఫ్యామిలీ తెలిపిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల రూపాయలు సాయంగా అందించారు.
శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజ‌య్‌కు ఫోన్ చేసిన చిరంజీవి, ఆయన్ను ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితి ఎలా ఉన్నదీ, చికిత్స ఎలా అందుతున్నదీ... తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 'మేమంతా ఉన్నాం'  అజ‌య్‌కు అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ "చిరంజీవి గారు అంటే నాన్నగారికి ఎంతో అభిమానం. వాళ్లిద్దరూ కొన్ని సినిమాలకు కలిసి పని చేశారు. ఇటీవల 'ఆచార్య' షూటింగులోనూ చిరంజీవిగారిని నాన్న కలిశారు. ప్రస్తుతం మేం ఉన్న పరిస్థితిల్లో మాకు ప్రతి రూపాయి చాలా అవసరం. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేం. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాను" అని అన్నారు.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎ.ఐ.జి ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్‌లో వెంటిలేటర్ మీద శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య క్వారంటైన్‌లో ఉన్నారు. పెద్ద కుమారుడు సైతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఆల్రెడీ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి హెల్ప్ చేస్తానని నటుడు సోనూ సూద్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొంత మంది ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఆయనకు ఆర్ధిక సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ తమిళ హీరో ధనుష్ కూడా కొంత మొత్తం సాయం అందించినట్టు సమాచారం. 



Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
Also Read: ఆమె తరఫున నన్ను క్షమించండి.. సిరి బాయ్ ఫ్రెండ్ రియాక్షన్..
Also Read: ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి