బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి మొదటి నుంచి కూడా గేమ్ లో దూసుకెళ్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె కాస్త డల్ అవుతుంది. హౌస్ లో జెస్సీ ఉన్నంతవరకు సిరి-జెస్సీ-షణ్ముఖ్ లు ఎంతో స్నేహంగా ఉండేవారు. జెస్సీ బయటకు వెళ్లిపోయిన తరువాత సిరి.. షణ్ముఖ్ కి బాగా క్లోజ్ అయిపోయింది. హగ్గులు, ముద్దులు అంటూ రెచ్చిపోతుంది ఈ జంట. మొన్న ఎపిసోడ్ లో 'నియంత' టాస్క్ లో షణ్ముఖ్ లో చైర్ లో కూర్చున్న వెంటనే సిరి అతడిని గట్టిగా హత్తుకొని మరీ ముద్దుపెట్టింది. 

 

దీంతో సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగిపోతుంది. బహుశా వీరిద్దరూ సింగిల్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ.. ఇప్పుడు మాత్రం ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. బిగ్ బాస్ కు రాకముందే సిరికి నటుడు శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. షణ్ముఖ్ చాలా రోజులుగా దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. సిరి కారణంగానే షణ్ముఖ్ గేమ్ దెబ్బతింటుందని ఆమెని బాగా ట్రోల్ చేస్తున్నారు. 

 

నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో హౌస్ లోకి సిరి మదర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రాగానే సిరి-షణ్ముఖ్ హగ్గులు గురించే మాట్లాడింది. సిరి.. షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడం ఆమెకి అసలు నచ్చడం లేదని అందరిముందే అనేసింది. ఎవరి గేమ్ వాళ్లు ఆడండి అంటూ సలహా ఇచ్చింది. సిరి తల్లి అందరిముందే అలా అనడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తల్లిగా కూతురు తప్పొప్పుల గురించి మాట్లాడే హక్కు ఆమెకి ఉందంటూ కొందరు సపోర్ట్ చేస్తుంటే.. షోలో అందరి ముందు అలా అనడం కరెక్ట్ కాదంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

తాజాగా ఈ విషయంపై సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ స్పందించాడు. సిరి మదర్ కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేశారని.. పాపం వాళ్లు ఉన్న వాతావరం అలాంటిది అని చెబుతూ.. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారని శ్రీహాన్ చెప్పుకొచ్చారు. ఆంటీ అలా అంటారని తను కూడా ఊహించలేదని.. దయచేసి ఆమెపై కోప్పడొద్దని కోరారు. ఆమె తరఫున తను క్షమాపణలు చెబుతున్నానని.. సిరి-షణ్ముఖ్ ల రిలేషన్ ను గౌరవిస్తున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చాడు. శ్రీహాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  

 



Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?


Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!


Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!


Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి