హీరో మహేష్ బాబుకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సమాచారం తెలియగానే ఆయన అభిమానులు షాకయ్యారు. ఇటీవలే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో పర్యటించారు. న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకున్నారు. గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
‘‘కోవిడ్-19కు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించినా.. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో నేను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసినవాళ్లు కూడా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోండి. వ్యాక్సిన్ వేయించుకోనివారు వెంటనే తీసుకోండి. వ్యాక్సిన్ వల్ల కోవిడ్ లక్షణాలు, ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు తగ్గుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సేఫ్‌గా ఉండండి’’ అని మహేష్ బాబు పేర్కొన్నారు.
Also Read: ‘దొరికితే దవడ పగిలిపోద్ది’.. చిరుతో విభేదాలు ఘాటుగా స్పందించిన బాలయ్య
Also Read: అజిత్ సినిమాకు కరోనా ఎఫెక్ట్... వలిమై రిలీజ్ వాయిదా వేసిన చిత్ర బృందం
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?