ఇటీవల కరీంనగర్ లో జీవో నంబర్ 317 సవరణ చేయాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోవిడ్ నిబంధనల కారణంగా దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. బీజేపీ శ్రేణుల సాయంతో బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో దీక్ష ప్రారంభించారు. పోలీసులు ఈ దీక్షను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ దీక్ష భగ్నం చేసే క్రమంలో కార్యాలయం తలుపులు కట్టర్ తో కట్ చేశారు పోలీసులు. అనంతరం బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనలో అటు పోలీసులతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఈ ఘర్షణలో గాయపడిన బీజేపీ కార్యకర్తలు పోలీసుల మమ్మల్ని టార్గెట్ చేసి కొట్టారని ఆరోపిస్తున్నారు.
Also Read: వనమా రాఘవ అరెస్టు.. కుమారుడిపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లేఖ రాసిన కాసేపట్లోనే..
సీపీ స్థాయిని మరిచి ప్రవర్తించారు : బీజేపీ కార్యకర్తలు
జీవో నెంబర్ 317 సవరణకై బండి సంజయ్ కి మద్దతు తెలుపుతూ తాము చేయాలనుకున్న దీక్షలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాఠీఛార్జి చేశారన్నారు. మహిళలపై దాడిని అడ్డుకున్నందుకు సీపీ స్థాయి అధికారి లాఠీఛార్జి చేశారనీ.... మీడియాతో సహా ఎవ్వరినీ వదలకుండా తీవ్రంగా కొట్టారని కరీంనగర్ ధర్నాలో గాయపడ్డ కార్యకర్తలు, నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఈ దీక్షలో గాయపడిన నేతల్ని పరామర్శించారు. స్థానిక నాయకులు అప్పటి సంఘటనను గుర్తు తెచ్చుకుని ఆవేదన చెందారు. మరికొంత కార్యకర్తలు ఇప్పటికీ అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Also Read: 'ఇక ధర్మ యుద్ధం స్టార్ట్ అయింది'.. కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల..
బీజేపీ కార్యకర్తలు లాఠీలు, బుల్లెట్లకు భయపడరు : రమణ్ సింగ్
ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ నియంతృత్వ పాలనపై బండి సంజయ్ నాయకత్వంలో పోరాడుతున్నారన్నారు. కరీంనగర్ లో పోలీసులు దారుణంగా వ్యవహరించారని, కార్యకర్తలను, మహిళలని కూడా చూడకుండా లాఠీ ఛార్జి చేసి గాయపర్చారని ఆరోపించారు. కరీంనగర్ కమిషనర్ సహా బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, బీజేపీ హవా కొనసాగుతోందన్నారు. బీజేపీ కార్యకర్తలు లాఠీలకు, బుల్లెట్లకు భయపడరన్న రమణ్ సింగ్.. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు చూపుతున్న పోరాటానికి సెల్యూట్ అన్నారు. తెలంగాణలో నిజాం నియంతృత్వ, రజాకార్ల పాలన కొనసాగుతుందని రమణ్ సింగ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన 317జీవో సవరించాలని బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ చేస్తున్న పోరాటం అభినందనీయం కొనియాడారు.
Also Read: Bandi Sanjay: హైకోర్టులో బండి సంజయ్ కి ఊరట.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం