పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నట్టు.. సీఎం జగన్ చెప్పారు. వాటిని పరిశీలిస్తామన్నారు. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు.  అయితే ఉద్యోగ సంఘాల నేతలు ప్రాక్టికల్ గా ఆలోచించాలని జగన్ కోరారు. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని సీఎం అన్నారు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నట్టు చెప్పారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనే ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు.


ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తాం. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నా. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలి. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. మంచి చేయాలన్న తపనతో ఉన్నాం. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తాం. నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యుడినే.


గతంలో పలుమార్లు స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగినప్పటికీ వివాదం తేలలేదు. ఫిట్‌మెంట్ 34 శాతం ఇవ్వాల్సిందేనని  ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని దాదాపుగా ప్రతి సమావేశంలోనూ అధికారులు వివరిస్తూ వస్తున్నారు. వస్తున్న ఆదాయం అంతా జీత, భత్యాలకే సరిపోతుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వ వాదనతో అంగీకరించడం లేదు. ఇక అధికారులతో చర్చలు జరపబోమని నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చలు జరుపుతామని ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ సమావేశమయ్యారు.
 


ఉద్యోగ సంఘాలు గతంలో ఆందోళన బాట పట్టినా ఇటీవల ఉపసంహరించుకున్నాయి. తొమ్మిదో తేదీ వరకూ చూస్తామని అప్పటిలోపు ప్రభుత్వం స్పందించకపోతే.. ఎక్కడ ఆపామో.. అక్కడి నుంచే ఆందోళనలు చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు గతంలో చెప్పారు. ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తారా... పీఆర్సీ ప్రకటనతో సంతృప్తి చెందుతారా అన్నది తెలియాల్సి ఉంది.


 


Also Read: AP PRC : గురువారమే పీఆర్సీ ఎపిసోడ్‌కు ముగింపు.. ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ ఖరారు !?


Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి