ABP  WhatsApp

Bulli Bai App Case: 'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం

ABP Desam Updated at: 06 Jan 2022 01:16 PM (IST)
Edited By: Murali Krishna

బుల్లి బాయ్ కేసు ప్రధాన నిందితుడ్ని దిల్లీ ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసింది.

'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం

NEXT PREV

బుల్లి బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడ్ని దిల్లీ పోలీసు IFSO ప్రత్యేక సెల్ అసోంలో అరెస్ట్ చేసింది. ఈ మేరకు IFSO డీసీపీ కేపీఎస్ మల్‌హోత్రా తెలిపారు.







బుల్లి బాయ్ యాప్ రూపకర్త, ఆ యాప్ ట్విట్టర్ ఖాతా హోల్డర్ అయిన నీరజ్ బిష్ణోయిని అసోంలో దిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ బృందం అరెస్ట్ చేసింది. ఇతనే ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతడ్ని దిల్లీ తీసుకువస్తున్నాం.                                     - కేపీఎస్ మల్‌హోత్రా, డీసీపీ (IFSO)


ఈ కేసుకు సంబంధమున్న ముగ్గుర్ని ముంబయి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం వర్గానికి చెందిన మహిళల ఫొటోలను ఈ యాప్‌లో పెట్టి వేలం వేస్తున్నట్లు పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఓ మహిళను ఉత్తరాఖండ్​లో ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని కూడా ఈ కేసులో అరెస్ట్​ చేశారు. అతడిని విశాల్​ కుమార్​గా గుర్తించారు. మరికొందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.


అసలేంటి కథ?


బుల్లీ బాయ్​​ పేరిట టెక్నాలజీని ఉపయోగించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వర్గానికి చెందిన మహిళలను కించపరిచేలా వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టేస్తున్నారు. బుల్లీ బాయ్‌ నిర్వాహకులపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎంపీ ఫిర్యాదు..


శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ యాప్ నిర్వాహకులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసుల సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని


Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 06 Jan 2022 01:16 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.