కేఫ్ ఓపెనింగ్ కి పిలిచేందుకు నందు, తులసి రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన బసవయ్య మొగుడు పెళ్ళాలు కానీ మొగుడు పెళ్ళాలు వస్తున్నారని అంటాడు. దివ్య వాళ్ళని చూసి పరుగున వెళ్ళి కౌగలించుకుంటుంది. బసవయ్య మధ్య మధ్యలో చురకలు వేస్తూ ఉంటాడు. సందు దొరికిందని విక్రమ్ తాతయ్య రాజ్యలక్ష్మికి కౌంటర్ వేస్తాడు. బోనాల పండుగ బాగా జరిగిందని దివ్య సంతోషంగా చెప్తుంటే లాస్య ఎంట్రీ ఇస్తుంది. ఒక రాధ ఇద్దరు కృష్ణులు.. ఒక మొగుడు ఇద్దరు మాజీ పెళ్ళాలు ఇప్పుడు కదా కథ మంచి రసపట్టుగా ఉండేదని బసవయ్య మనసులోనే చంకలు గుద్దుకుంటాడు. వచ్చిన పని చూసుకుని వెళ్ళమని ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని దివ్య అంటే ప్రసన్న ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు మీ అత్తయ్య అని కౌంటర్ వేస్తుంది. నీ ఉద్యోగం హాస్పిటల్ లో అయినా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఎందుకు కనపడుతున్నావని నేనేమైనా అడిగానా అని తులసి అంటుంది. దానికి తన బాస్ ఇక్కడే ఉందని చెప్పి లాస్య కౌంటర్ వేస్తుంది.


Also Read: తాగేసి రచ్చ రచ్చ చేసిన మురారీ- డైరీ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు గీతికని కలిసిన కృష్ణ


తులసి వాళ్ళ ముందే కావాలని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. కేఫ్ రీఓపెన్ చేస్తున్నామని తులసి అంటుంది. మా కేఫ్ లో ఇంతకముందు ఒక దెయ్యం తిరిగేది దాన్ని వదిలించుకుని ఇప్పుడు కొత్త పేరుతో కొత్తగా రీఓపెన్ చేస్తున్నామని లాస్యకి తగిలేలా నందు చెప్తాడు. అల్లుడు, కూతురు చేతుల మీద రీఓపెన్ చేయించాలని అనుకుంటున్నట్టు తులసి చెప్తే కుదరదని సంజయ్ ఆన్సర్ ఇస్తాడు. పొరపాటున కేఫ్ లాస్ అయితే ఆ తప్పు మా అన్నయ్య మీదకి తోసేస్తారు. అయినా మా అన్నయ్య లెవల్ ఏంటి? తనకి ఇది పరువు తక్కువని అంటాడు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు విక్రమ్ అని తాతయ్య చెప్తాడు. అన్నయ్య అమాయకుడు ఒప్పింద్దామని అనుకుంటున్నారని అనేసరికి దివ్య నోరు మూయమని చెప్తుంది. తులసి వాళ్ళు ఆ మాటకి షాక్ అవుతారు. ఇప్పుడు విక్రమ్ ఓపెన్ చేస్తే రేపు సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి కూడా పిలుస్తారని అరుస్తూ మాట్లాడతాడు.


విక్రమ్ వచ్చి ఎవరి మీద అరుస్తున్నారని అడుగుతాడు. ఇంకెవరి మీద మా అమ్మానాన్న మీదని దివ్య చెప్తుంది. లాస్య జోక్యం చేసుకుంటే ఇది మా ఇంటి ప్రాబ్లం మీరు జోక్యం చేసుకోవద్దని చురక వేస్తాడు. రేపు వాళ్ళ కేఫ్ రీఓపెన్ అంట నిన్ను పిలవడానికి వచ్చారు ఇంత చిన్న వాటికి మా అల్లుడు ఎందుకు వేరే వాళ్ళని చూసుకోమని చెప్పానని బసవయ్య అంటాడు. నేను చేయాలో వద్దో నా ఇష్టం మీరు ఎలా నిర్ణయిస్తారని అడుగుతాడు.


బసవయ్య: పెద్ద వాడినని చొరవ తీసుకున్నా అది కూడా తప్పేనా


విక్రమ్: తప్పు ఏముంది?  మేం కేఫ్ రీఓపెన్ కి వస్తాం మీరు ఏర్పాట్లు చేసుకోండి


తులసి: పెద్ద మనసుతో ఒప్పుకున్నారు సంతోషం అందరూ తప్పకుండా రావాలి


Also Read: భర్తని చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య- కోడలిని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు తిట్టిన అపర్ణ


గృహలక్ష్మి కిచెన్ ఓపెనింగ్ పనులు చకచకా జరిగిపోతూ ఉంటాయి. విక్రమ్, దివ్య, రాజ్యలక్ష్మి కేఫ్ కి వస్తారు. మా అమ్మ మనసులానే పేరు చాలా బాగుందని దివ్య అంటుంది. రాజ్యలక్ష్మికి తులసి శాలువా కప్పి సన్మానిస్తుంది. విక్రమ్ తో రిబ్బన్ కట్ చేయమని తులసి చెప్తే దివ్య ఇద్దరం కలిసి చేస్తామని చెప్తారు. కేఫ్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళాక లాస్య ఎంటర్ అవుతుంది. ఎప్పుడూ మీరే కదా సర్వ్ చేసేది ఇప్పుడు మేం చేస్తామని దివ్య అంటుంది. విక్రమ్ ని బేరర్ చేస్తారా ఏంటని లాస్య అడ్డుపుల్ల వేస్తుంది. ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్ ఆస్తులు అంతస్తులు గురించి ఇక్కడ మాట్లాడొద్దని విక్రమ్ చెప్తాడు. పిలవని పేరంటానికి వచ్చావ్ ఏంటని అనసూయ అంటుంది. లాస్య మా మనిషి అందుకే మాతో వచ్చిందని రాజ్యలక్ష్మి చెప్తుంది.