చిత్ర డల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటని వేద అడుగుతుంది. బావగారు వసంత్ కి ప్రమోషన్ ఇచ్చారంట. న్యూజిలాండ్ లో ఉన్న బ్రాంచ్ కి వెళ్ళమని చెప్పారు. కానీ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. మీరందరూ ఇక్కడ మేము అక్కడ ఎంతైనా రిస్క్. మా పెళ్లికి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. మీరు ఉండబట్టి వాటిని ఫేస్ చేయగలిగాము. కానీ ఇప్పుడు అక్కడ ఒంటరిగా ఉండటం కష్టంగా ఉంటుందని తన బాధని పంచుకుంటుంది. ఎన్నో గోడవల మధ్యలో మీ పెళ్లి జరిగింది. మీరు సంతోషంగా ఉండండి నేను ఉన్నా కదా అన్నీ చూసుకుంటాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఫారిన్ వెళ్ళమని ఎవరు చెప్తారు. మీరు ఫారిన్ వెళ్ళడం లేదని వేద చిత్రకి హామీ ఇస్తుంది.


Also Read: మాజీ భార్యకు దగ్గరయ్యేందుకు నందు తిప్పలు- 'గృహలక్ష్మి కిచెన్' ఓపెన్


వేద పిల్లల కోసం జ్యూస్ తీసుకుని వస్తుంది. ఆంటీ మీరు బాగా కథలు చెప్తారంట కదా చెప్పమని ఆదిత్య అడుగుతాడు. వేద రాముడి గురించి కథ చెప్తుంది. దాన్ని వింటూనే ఖుషి నిద్రపోతుంది. కన్నబిడ్డ కాకపోయినా చిన్నమ్మలు, పెద్దమ్మలు గొప్పగా చూసుకుంటారు అని అంటుంది. రాముడి సవతి తల్లి కైకేయి కదా అందుకే అడవులకి పంపించింది, కన్న తల్లి అయితే పంపించేది కాదు కదా అని ఆదిత్య చెప్తాడు. అలా పంపించబట్టే రాముడు గొప్పవాడు అయ్యాడని వేద అంటుంది. కానీ ఆదిత్య మాత్రం సవతి తల్లి బుద్ధులు చూపించుకుంటారు. ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు కానీ నిజంగా ప్రేమగా ఉండరు. ఆదిత్య రివర్స్ లో తన కుటుంబం గురించి కథగా చెప్తాడు. సవతి తల్లి వల్ల పిల్లల తల్లి చాలా కష్టపడింది. పైకి మంచిదానిలా నటించేది, పిల్లల్ని బాగా ప్రేమించినట్టు నటించేది. ఎందుకంటే సవతి తల్లి ఎప్పటికీ సవతి తల్లే అనేసరికి వేదకి కన్నీళ్ళు ఉప్పొంగుకొస్తాయి.


Also Read: కృష్ణకి తల్లిలా మారి గోరుముద్దలు తినిపించిన రేవతి- భార్య కోసం కన్నీళ్ళు పెట్టుకున్న మురారీ


కథ అడ్డం పెట్టుకుని వేద మీద తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడతాడు. ఎప్పటికైనా సవతి తల్లి ఇంట్లో నుంచి బయటకి పోవాల్సిందే. ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే సవతి తల్లి అక్కడ ఉండకూడదని అంటాడు. వేద బాధపడుతుంటే యష్ వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. పిల్లల కోసం ఏం చేసినా సవతి తల్లి కదా కన్నతల్లి కాలేదు కదా అని బాధపడుతుంది. ఆదిత్యకి రాముడు కథ చెప్పాను. తను సవతి తల్లి కదా అందుకేనా రాముడిని అడవికి పంపించిందని అన్నాడు. సవతి తల్లి బ్యాడ్ మదర్ అన్నాడని ఏడుస్తుంది. శ్రీకృష్ణుడు కూడా యశోధకి కన్నకొడుకు కాదు కానీ ఎంత బాగా పెంచిందని భార్యకి మంచిగా ఊరటనిచ్చేలా మాట్లాడతాడు. కాసేపటికి ఇద్దరూ మామూలుగా అయిపోయి సరదాగా మాట్లాడుకుంటారు. కాఫీ తీసుకొస్తానని చెప్పి యష్ వెళ్ళిపోతాడు.


ఆదిత్య మాళవిక దగ్గరకి వస్తాడు. ఆవిడని గట్టి దెబ్బ కొట్టానని సంతోషంగా చెప్తాడు. జరిగింది మొత్తం చెప్తే మాళవిక సంబరపడుతుంది. నువ్వు నా కొడుకువని నిరూపించుకున్నావ్. మనం ఇలాగే ఉండాలని మాళవిక చెప్తూ ఉంటే అప్పుడే అటుగా వేద వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. వేద చాలా డేంజరస్, నువ్వంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. కానీ అది కేవలం నటన మాత్రమే. నటించి ఖుషిని తనవైపు తిప్పుకున్నట్టు నిన్ను తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు ఆ వలలో చిక్కుకోవు. ఎందుకంటే నువ్వు నా కొడుకువి. మనకి డాడీ సపోర్ట్ కావాలి లేదంటే గెలవలేము. డాడీకి నువ్వంటే ప్రేమ. కానీ మీ డాడీని కూడా మార్చగల రాక్షసి వేద. నువ్వు ఈ ఇంటికి వారసుడివి. నువ్వే ఇక్కడ రారాజువి. అది అందరూ తెలుసుకోవాలని ఆదిత్యతో చెప్తుంది. ఇంత నీచమా, ఇంత ఘోరమా కన్నకొడుకు మనసులోనే విషం నింపుతావా? ఒక తల్లి చేయాల్సిన పనేనా ఇది. మా అమ్మ చెప్పింది పాముకు పాలు పోస్తున్నావ్ ఇక నుంచి మన మధ్య సమరమేనని వేద శపథం చేస్తుంది.