తన కొడుకు, కోడలు కాకుండ నిప్పుల గుండం మీద నడుస్తానని రాజ్యలక్ష్మి అంటుంది. బాగా ఆరాటపడుతుంది చెప్తా నీ సంగతి అనుకుని తల్లిగా బాధపడుతుంది ఈమెనే నడవనివ్వమని చెప్పమని లాస్య పంతుల్ని అడుగుతుంది. దీనికి ఏం వచ్చింది ఇలా నన్ను ఇరికిస్తుందని రాజ్యలక్ష్మి భయపడుతుంది. హోమం చేసింది నేను నేనే నడుస్తానని దివ్య అనేసరికి తులసి వాళ్ళు షాక్ అవుతారు. మళ్ళీ తనే నిప్పుల గుండం తొక్కుతానని అనేసరికి మన అమాయక చక్రవర్తి విక్రమ్ తను నడుస్తానని చెప్తాడు. తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు తెగ సంబరపడతారు. ఏదో ఒకటి చేసి వీళ్ళని ఆపమని నందు తులసిని అడుగుతాడు. తమ ఆచారం ప్రకారం నిప్పుల గుండం మీద నడిచే ముందు పసుపు నీళ్ళతో స్నానం చేస్తారని చెప్పి వాళ్ళని తులసి తీసుకెళ్తుంది. ఇద్దరికీ పసుపు నీళ్ళు పోసిన తర్వాత నిప్పుల గుండం మీద నడుస్తారు.


Also Read: కృష్ణకి తల్లిలా మారి గోరుముద్దలు తినిపించిన రేవతి- భార్య కోసం కన్నీళ్ళు పెట్టుకున్న మురారీ


దివ్య నడిచి అయిపోయిన తర్వాత కళ్ళు తిరిగి పడబోతుంటే తులసి పట్టుకుంటుంది. లాస్య జుట్టుపట్టుకుని తులసి విదిలిస్తుంది. జుట్టు పట్టుకునే సరికి అల్లాడిపోతుంది. నా కూతుర్ని నిప్పుల గుండం మీద నడిపిస్తావా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి. ఇప్పుడు నేను ఏంటో చూపిస్తానని అంటుంది. నీ జీవితాంతం గుర్తు ఉండేలా గుణపాఠం నేర్పిస్తానని చెప్తుంది. ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే నీ తలకి కొరివి పెడతాను ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తుంది. దివ్య నొప్పులతో అల్లాడిపోతుంది. కూతురికి దగ్గరుండి సేవలు చేసుకుంటుంది. బోనాలు ఎప్పుడు చూడలేదని మీ వల్లే అది జరిగిందని తులసికి విక్రమ్ థాంక్స్ చెప్తాడు. బంధాలు దగ్గర అవాలంటే మన రెండు కుటుంబాలు కలుస్తూ ఉండాలని అంటాడు. మీరు ఇంటికి వెళ్ళినా మీ మనసు ఇక్కడే ఉంటుంది ఈరోజుకి దివ్యతోనే ఉండవచ్చు కదా అని అడుగుతాడు. కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టిన తర్వాత అమ్మ చుట్టమే అవుతుందని చక్కగా చెప్తుంది.


తులసి తన జీవితానుభవాలు కొడుకుల గురించి విక్రమ్ కి చెప్తుంది. చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా ఆలోచించమని అల్లుడికి హితబోధ చేసి వెళ్తుంది. తను ఏం చెప్పిందో విక్రమ్ కి అర్థం కానట్టు మొహం పెడతాడు. నందు ఇంట్లో ఆవేశంతో గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. లాస్య రాజ్యలక్ష్మి దగ్గరకి చేరి దివ్య జీవితం నాశనం చేస్తుందని తులసి కూడా బాధపడుతుంది. తన తల్లి గురించి విక్రమ్ తో చెప్పేయమని అనసూయ సలహా ఇస్తుంది. ఆ ప్రయత్నం కూడా చేశాను కానీ విక్రమ్ నమ్మలేదు. దివ్యతో కలిసి గొడవ పడ్డాడని తులసి అంటుంది. లాస్యతో ఆ ఇంటికి సంబంధం లేకుండా చేయాలని, తను చేస్తున్న తప్పులు విక్రమ్ కి తెలిసేలా చేయాలని తులసి డిసైడ్ అవుతుంది.


Also Read: ప్రాణాపాయ స్థితిలో రాజ్- అప్పుని విడిపించేందుకు వచ్చి ఇరుక్కుపోయిన మీనాక్షి


నందు కేఫ్ పేరు మార్చాలని తన నిర్ణయాన్ని చెబుతాడు. కేఫ్ కి ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నట్టు పరంధామయ్య అడుగుతాడు. తులసి కిచెన్ అనేసి బ్యానర్ చూపిస్తాడు. అది చూసి ముసలోళ్ళు సంబరపడతారు. తనకి నచ్చలేదని తులసి అంటుంది. నందు తులసమ్మని లైన్లో పెట్టాలని ట్రై చేస్తున్నారని రాములమ్మ పసిగట్టెస్తుంది. ఎన్ని చెప్పినా కూడా తులసి ఒప్పుకోదు, ఇలాగే చేస్తే కేఫ్ కి రానని అనేస్తుంది. దీంతో పేరు మారుస్తానని అంటారు. తులసి కిచెన్ కి బదులు గృహలక్ష్మి కిచెన్ పెడతానని చెప్తే అందరూ ఒకే అంటారు.