కృష్ణమూర్తి స్టేషన్ బయట కూర్చుని అప్పు గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. కనకం ఫుడ్ తీసుకొచ్చి తినమని చెప్తుంది. దిగులుగా ఉంటే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని కనకం ధైర్యం చెప్తుంది. అప్పుడే మీనాక్షి వాళ్ళ దగ్గరకి వస్తుంది. రాజ్ సంతోషంగా క్యాబిన్ లోకి వస్తాడు. కావ్య ఏంటి వెలిగిపోతుందని అడుగుతుంది. తనని చూడగానే మొహం చిరాకుగా పెట్టేస్తాడు. సర్లే నువ్వు ఏదో చెప్పాలని అన్నావ్ కదా అదేంటో చెప్పమని అడుగుతాడు. ఓహో బెడ్ రూమ్ విషయమా అని గట్టిగా అరుస్తుంది. ఏయ్ ఎందుకు అలా అరుస్తున్నావని కంగారుపడతాడు. సరే విషయం చెప్పమని అంటే చెప్పనని బెట్టు చేస్తుంది. మీనాక్షి ఎస్సై దగ్గరకి వచ్చి లాజిక్ మాట్లాడి హడావుడి చేస్తుంది. మీరు గొడవ చేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని ఎస్సై అనేసరికి భయపడిపోతుంది.


ALso Read: కావ్య వేసిన డిజైన్స్ చింపేసిన రాజ్- అప్పు మీద మర్డర్ కేసు


కావ్య రాజ్ కంటే ముందు నడుస్తుంటే నువ్వు ఎంత నడిచినా నేను నా కారు డోర్ తీయాలని పొగరుగా చెప్తాడు. ఇద్దరూ పోట్లాడుకుంటే అక్కడే ఉన్న ఆటో అతను ఎవరో మొగుడు పెళ్ళాలు గొడవ పడుతున్నారు వెళ్తే డబ్బులు వస్తాయని దూరతాడు. ఇద్దరి దెబ్బకి పారిపోబోతుంటే కావ్య ఆపి ఆటో ఎక్కుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంటికే వస్తావ్ కదా నా పొగరు ఎలా ఉంటుందో ఇంట్లో చూపిస్తానని అనుకుంటాడు. ఎలాగైనా అప్పుని విడిపించి చెల్లి బాధని పోగొట్టాలని మీనాక్షి మళ్ళీ ఎస్సై దగ్గరకి వెళ్తుంది. లంచం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కాసేపు ఎస్సై బుర్ర తినేస్తుంది. కావ్య వంట చేస్తుంటే రాజ్ కిచెన్ లోకి వచ్చి గరిటెని అడ్డం పెట్టుకుని తనకి ఎవరి వంట అవసరం లేదని ఇన్ డైరెక్ట్ గా పెళ్ళానికి చెప్తాడు. కిచెన్ లో పాత్రలు అడ్డం పెట్టుకుని ఇద్దరూ మాట్లాడుకుంటారు.


కోడిగుడ్డుని చపాతీల కర్రతో పగలగొట్టబోతుంటే కావ్య నోరేళ్లబేడుతుంది. బలమైన ఆయుధాలు ప్రయోగించకూడదని అనుకుని చాకు తెచ్చుకుంటాడు. ఆమ్లెట్ వేసుకుని తెగ బిల్డప్ కొడతాడు. కావ్య వంట చేసుకుని హాయిగా లాగించేస్తుంది. మాడిపోయిన ఆమ్లెట్ వేసుకుని దాన్ని తినలేక అవస్థలు పడతాడు. చిన్న పిల్లాడిలా ఏంటి మీరు ఆకలికి ఉండలేరని కావ్య భోజనం వడ్డించబోతుంటే వద్దని అంటాడు. అప్పుడే భిక్షగాడు వచ్చి ఆకలేస్తుందని అన్నం పెట్టమని అడుగుతాడు. రాజ్ కావ్య ప్లేట్ లో కొంచెం ఫుడ్ పెట్టేసి మొత్తం తీసుకెళ్ళి బిచ్చగాడికి వేసేస్తాడు. ఇంత పంతం అవసరమా అని కావ్య బాధగా అడుగుతుంది.


Also Read: ఫస్ట్ నైట్ లో అభిమన్యుని వణికించేసిన నీలాంబరి- యష్, వేద మధ్యలో మాళవిక


రేపటి ఎపిసోడ్లో.. 


రాజ్ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే కావ్య నిద్రలేచి చూసి కంగారుపడుతుంది. మందు వేద్దామని చూస్తే అవి అయిపోతాయి. దీంతో భర్తని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చి వాచ్ మెన్ ని పిలిచి కారు తీయ్యి హాస్పిటల్ కి వెళ్లాలని చెప్తుంది. కానీ వాచ్ మెన్ కారు నడపడం రాదని చెప్పేసరికి అతని బైక్ తీసుకుని భర్తని వెనుక కూర్చోబెట్టుకుని చీరతో తనకి కట్టేసుకుని బయల్దేరుతుంది.