సోషల్ మీడియాలో ఎంతోమందికి తెలిసిన వ్యక్తి జ్యోస్తెటిక్. ఇతను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. అసలు పేరు జో లిండ్రెర్. కండలు తిరిగిన శరీరంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఫిట్నెస్ వీడియోలు షేర్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యా.రు అలాంటి వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. అతని మరణానికి కారణం అనూరిజమ్. ఏమిటిది? ఎందుకు వస్తుంది. 


అనూరిజమ్ అనే సమస్య ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ఈ సమస్య వస్తే శరీరంలోని రక్తనాళాలు ఉబ్బుతాయి. అవి విపరీతంగా ఉబ్బితే చివరకు చిట్లిపోతాయి. ఇలా చిట్లిపోవడం వల్ల అంతర్గత రక్తస్రావం అయి మరణించే అవకాశం ఉంది. శరీరంలోని ఏ భాగంలో అయినా అనూరిజమ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీని లక్షణాలు అనూరిజం ఏర్పడానికి కొన్ని గంటలు లేదా రెండు మూడు రోజులు ముందు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వాటిని తేలికగా తీసుకుంటే ఏమైనా జరగవచ్చు. తలనొప్పి, మెడ నొప్పి, పక్షవాతం,  మాట్లాడలేకపోవడం, వెన్నునొప్పి, మింగడంలో ఇబ్బంది పడడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీ నొప్పి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అనూరిజమ్ మెదడులో ఏర్పడితే సెరెబ్రల్ అనూరిజమ్ అంటారు. అదే ఛాతిలో ఏర్పడితే థోరాసిక్ అనూరిజమ్ అంటారు. ఇది పొత్తికడుపు భాగంలో కూడా ఏర్పడవచ్చు, అంటే ఆయా భాగాల్లోని రక్తనాళాలు ఉబ్బి చిట్లిపోయే అవకాశం ఉందని అర్థం.


ఎందుకు వస్తుంది?
కొన్ని రకాల వారసత్వంగా వచ్చే వ్యాధుల వల్ల కూడా అనూరిజం ఏర్పడవచ్చు. రక్తనాళాల గోడలు బలహీనంగా ఉన్నా కూడా ఈ పరిస్థితి వస్తుంది. అధిక రక్తపోటు వల్ల, సిఫిలిస్ అనే ఇన్ఫెక్షన్ కు చికిత్స చేయకుండా వదిలేయడం వల్ల, పోలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి వల్ల కూడా అనూరిజమ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వల్ల రక్తం గడ్డ కట్టొచ్చు. నరాలు సంకోచించి సన్నగా మారిపోతాయి. గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు విఫలం చెందుతాయి.


ఎలా గుర్తిస్తారు?
శరీరంలో విపరీతమైన నొప్పులు వస్తున్నప్పుడు వైద్యులను సంప్రదించడం ముఖ్యం. ఎక్స్ రే, సిటీ స్కాన్‌లు , ఎంఆర్ఐ స్కాన్‌లు, అల్ట్రా సౌండ్ స్కాన్‌లు, ఫ్లూయిడ్ టెస్టులు చేసి  ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. 



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


Also read: తెల్లటి మచ్చల్లా కనిపించే బొల్లి రోగం వారసత్వంగా వస్తుందా? రాకుండా అడ్డుకోగలమా?
































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.